హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంసెట్ దరఖాస్తు మరోసారి పొడగింపు.. ఐదోసారి ఎక్స్‌డెంట్..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఎంసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువును మ‌రోసారి పొడిగించారు. అప‌రాధ రుసుం లేకుండా ఈ నెల 24వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని ఎంసెట్ క‌న్వీన‌ర్ గోవర్థన్ వెల్ల‌డించారు. విద్యార్థుల విజ్ఞ‌ప్తి మేర‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించామని ఆయన తెలిపారు.తెలంగాణ ఎంసెట్ పరీక్షను ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ నిర్వహిస్తోంది.

పరీక్ష దరఖాస్తు గడువు మే 18న ముగియాల్సి ఉండగా.. ఇప్పటికీ నాలుగుసార్లు పొడిగించిన సంగతి తెలిసిందే. తిరిగి జూన్ 24 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ మోడ్‌ ఆధారంగా జరుగుతాయి. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో నిర్వహించనున్నట్లు ఇదివరకే అధికారులు వెల్లడించారు.

another time eamcet application date extended in the telangana state.

అగ్రికల్చర్‌ వారికి 3, ఇంజినీరింగ్‌ వారికి 5 సెషన్లు, మరో సెషన్‌ను అవసరాన్ని బట్టి నిర్వహించనున్నట్లు జేఎన్‌టీయూ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ.. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ఇంజనీరింగ్ కోసం 2 లక్షల 25 వేల 125 మంది, అగ్రికల్చర్ బీఎస్సీ కోసం 75 వేల 519 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ గడువు పొడిగింపు వల్ల వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు కూడా దరఖాస్తు చేసుకనే అవకాశం కలిగింది.

కరోనా వల్ల విద్యా సంవత్సరాలు పొడగిస్తు వస్తున్నారు. పిల్లలకు ఆన్ లైన్ తరగతులు నడుస్తున్నాయి. 9, 10.. ఇంటర్ విద్యార్థులు కూడా ప్రమోట్ అవుతున్నారు. సీబీఎస్ఈ కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తోంది. కానీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మాత్రం నిర్వహించాల్సి వస్తోంది. ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు తేదీని పొడగిస్తు వస్తున్నారు.

English summary
another time eamcet application date extended in the telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X