Telangana Assembly Elections Result 2023: హైదరాబాద్‍లోని కౌంటింగ్ కేంద్రాలు ఇవే..!

తెలంగాణలో పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఇప్పుడు ఫలితాలపై పడింది. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్నాయి. ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు చేసి ఈవీఎంలు భద్రపరిచారు.హైదరాబాద్‌ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో పలు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలకు ఏర్పాటు చేస్తున్నారు.

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆంక్షాలు విధించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ భద్రతను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Election counting centers have been set up in many parts of Hyderabad
ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ దోమల్‌గూడ, ఇండోర్ స్టేడియం అంబర్‌పేట్, R.B. వెంకట్రామా రెడ్డి మహిళా కళాశాల లింగంపల్లి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం యూసుఫ్‌గూడ, కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మాసబ్ ట్యాంక్, ESRA హాల్ తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయం కోఠి, కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్, 1వ అంతస్తు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, ముక్కరం జాహీ రోడ్, అబిడ్స్ లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

నిజాం కాలేజ్ బషీర్‌బాగ్, సరోజినీ నాయుడు వనితా మహా విద్యాలయం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లి, అరోరాస్ లీగల్ సైన్సెస్ అకాడమీ బండ్లగూడ, ప్రొఫెసర్ జి. రాంరెడ్డి దూరవిద్య అధ్యయన కేంద్రం ఉస్మానియా యూనివర్శిటీ,ఆడిటోరియం హాల్-I, గ్రౌండ్ ఫ్లోర్‌లో, CSI ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెస్లీ కాలేజీ గ్రౌండ్, ఆనంద్ థియేటర్ ఎదురుగా, సికింద్రాబాద్ కూడా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+