హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారెక్కనున్న మాజీ కెప్టెన్ : ఎంపీ సీటు ఖరారు ..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత కూడా కాంగ్రెస్ లో క‌ల‌వ‌రం కొన‌సాగుతూనే ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేత‌లుగా ఉన్న వారు సైతం పార్టీని వీడేందుకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా..మాజీ ఎంపి..ప్ర‌స్తుత తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మాజీ కెప్టెన్ సైతం కారెక్కేందుకు సిద్ద‌మ‌య్యారు...

ఇండియా క్రికెట్ టీం మాజీ కెప్టెన్‌

ఇండియా క్రికెట్ టీం మాజీ కెప్టెన్‌

ఇండియా క్రికెట్ టీం మాజీ కెప్టెన్‌.. రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్.. మాజీ ఎంపీ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ వీడేం దు కు సిద్ధమవుతున్నారు. కొంత కాలంగా ఆయ‌న కాంగ్రెస్ ను వీడుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్నా..
ఆయ‌న పోటీ చేసే సీటు..రాజ‌కీయ భ‌విష్య‌త్ పై స్ప‌ష్ట‌మైన హామీ లేక త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

అజారుద్దీన్‌

అజారుద్దీన్‌

ఇటీవల ఓ ఎంపీ కూతురు వివాహంలో టీఆర్‌ఎస్‌ కీలక నేతలతో ఆయన చర్చలు జరిపినట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఆ ఎంపీ సైతం అజారుద్దీన్‌ను పార్టీ లోకి తీసుకొని సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేసిన ట్టు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత టీఆర్‌ఎస్‌లో అజారుద్దీన్‌ అధికారికంగా చేరుతున్నట్టు ఆయన సన్నిహితులు, అభిమానులు చ‌బుతున్నారు.

2009లో కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా..

2009లో కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా..

హైద‌రాబాద్ కు చెందిన అజారుద్దీన్ రాజ‌కీయ ప్ర‌వేశం నుండి కాంగ్రెస్ లోనే ఉన్నారు. 2009 లో కాంగ్రెస్ లో చేరిన ఆయ‌న అదే సంవ‌త్స‌రం లో జ‌రిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరా దాబాద్‌ స్థానం నుంచి గెలుపొందా రు. 2014లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పూర్తిగా తెలంగాణకే పరిమితమయ్యారు.

తాజాగా జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆయన్ను పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పార్టీ నియమించింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడటంతో అజారుద్దీన్‌ రాజకీయ భవిష్యత్‌ కోసం పార్టీ మారాలని నిర్ణ యం తీసుకున్నట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుండి టిఆర్‌య‌స్ కు సైతం బ‌ల‌మైన అభ్యర్ధి అవ‌స‌ర‌మ‌నే అభిప్రాయం ఉంది. దీంతో.. అజారుద్దీన్ కు అవ‌కాశం ఇవ్వ‌టం ద్వారా టిఆర్‌య‌స్ కు సైతం మేలు జ‌రుగుతుంద‌నే భావ‌న పార్టీ నేత‌ల్లో క‌నిపిస్తోంది.

English summary
Indian Cricket team ex captain Azahruddin may join in TRS shortly. He nor interest in Congress politics.. he wants to contest as MP form Secunderabad Loksabha segment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X