భాగ్యనగరంలో పేలుడు ..మహిళకు తీవ్ర గాయాలు... అలెర్ట్ అయిన పోలీసులు
భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికే అయోధ్య కేసు తీర్పు రానున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తమయ్యాయి. ఇక ఇదే సమయంలో ఏ చిన్న సంఘటన జరిగినా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా మీర్‌పేట్ విజయపురికాలనీలో పేలుడు సంభవించింది. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే హైదరాబాద్ పరిధిలోని మీర్ పేట విజయపురి కాలనీ లో ఓ మహిళ చెత్త ఏరుకునే క్రమంలో చెత్తకుప్పలో ఒక డబ్బా ని చూసింది. ఇక ఆ డబ్బా మూత తీసే ప్రయత్నం చేయగా డబ్బా ఒక్కసారిగా పేలింది. భారీ పేలుడు సంభవించడంతో చెత్త ఏరుకుంటున్న సదరు మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పేలుడు ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డబ్బాను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా కావాలని ఈ తరహా ఘటనలకు ప్లాన్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకపక్క దేశవ్యాప్తంగా అయోధ్య వివాదంపై తీర్పు రానున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. కేంద్ర అన్ని రాష్ట్రాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం అప్రమత్తం చేసింది. ఇక ఇదే సమయంలో మీర్ పేటలో డబ్బా లో బాంబు పేలడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక ఈ సంఘటన నేపథ్యంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications