హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయిల్ కూడా కల్తీ.. గుట్టుచప్పుడు కాకుండా దందా.. టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు

|
Google Oneindia TeluguNews

కల్తీకి కాదేది అనర్హం అని కేటుగాళ్లు అంటున్నారు. బియ్యం, ఉప్పు, పప్పు కల్తీ ఘటనలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల కారం కూడా కల్తీ చేయడం చూసి వినియోగదారులు నోరెళ్లబెట్టారు. ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ కూడా కల్తీ ఘటన కలకలం రేపుతుంది. హైదరాబాద్ నడిబొడ్డున కల్తీ మాఫియా విజృంభిస్తోంది. దీంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.

సర్వే కంపెనీకి చెందిన ఆయిల్ కల్తీకి సంబంధించిన సమాచారం టాస్క్‌ఫోర్స్ అధికారులకు తెలిసింది. వెంటనే హైదరాబాద్‌లో పలుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బహదూర్ పురాలో కల్తీ ఆయిల్ గుట్టును రట్టు చేశారు. కల్తీ ఆయిల్ సరఫరా చేస్తున్న నూర్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతని గోదాం నుంచి నకిలీ ఆయిల్‌ను భారీగా స్వాధీనం చేసుకున్నారు. నూర్ ముఠా వివరాలు ఆరా తీస్తున్నామని అధికారులు చెప్పారు. ఎంత మంది ఉన్నారు ? ఎక్కడికి సప్లై చేస్తున్నారు ? అనే అంశాలపై క్షుణ్ణంగా విచారిస్తున్నామని పేర్కొన్నారు.

fake oil supply in hyderabad.. task force police raids

కల్తీ బెడదతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మార్కెట్‌లో ఏది కల్తీ, ఏదీ అసలైన వస్తువో తెలుసుకోలేకపోతున్నామని వాపోతున్నారు. కల్తీ మాఫియాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే ప్రజల ప్రాణానికి ముప్పు తప్పదని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మేధావులు, ప్రజాసంఘాల నేతలు కూడా కల్తీ మాఫియాపై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
fake oil supply in hyderabad bahadurpura and various places also. today task force police raid to godowns and recover fake oil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X