అల్లు అర్జున్ జాతకం బయటపెట్టిన వేణు స్వామి...జరిగేది ఇదే అంటూ షాకింగ్ కామెంట్స్

ఇటీవల కాలంలో సోషల మీడియాలో మార్మోగుతున్న వారి లిస్ట్‌లో వేణు స్వామి కూడా ఒకరు. హీరో, హీరోయిన్లతో పాటు, రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలు గురించి చెబుతూ వేణు స్వామి వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్పి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీని సంపాదించకున్నారు. ఈయన చెప్పినవి,చెప్పినట్టుగా కొందరి జీవితాల్లో జరిగాయి కూడా.

నాగచైతన్య-సమంత జంట విడిపోతారని ముందుగానే చెప్పిన వేణు స్వామి... మెగా డాటర్ నిహారిక వైవాహిక జీవితం అంత సాఫీగా సాగదని చెప్పి సంచలనం సృష్టించారు. వేణు స్వామి చెప్పినట్టుగానే నిహారిక తన భర్త చైతన్యతో విడాకులు తీసుకుంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా విడుదలకు ముందే ఫ్లాప్ అవుతుందని.. ఆయన జాతకం కూడా ఏం అంత బాలేదని వేణు స్వామి తెలిపారు.

venu swamy

దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. డింపుల్ హాయతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా వేణు స్వామి ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

venu swamy

హీరో అల్లు అర్జున్ జాతకం ఎలా ఉందని వేణు స్వామిని యాంకర్ ప్రశ్నించగా.. ఆయన జాతకం అద్బుతంగా ఉందని వేణు స్వామి సమాధానం ఇచ్చారు. నిజం చెప్పాలంటే తెలుగులో అసలైన ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జునే అని .. ఆయనపై రూపాయి పెట్టుబడి పెడితే.. 10 రూపాయిలు వస్తాయని వేణు స్వామి తెలిపారు. మరో పదేళ్లు వరకూ ఆయనకు ఎటువంటి ఢోకా లేదని... పుష్ప-2తో అల్లు అర్జున్ సంచలనాలు సృష్టించడం ఖాయం అని వేణు స్వామి చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+