jabardasth: యువతితో శారీరక సంబంధం..జబర్దస్త్ ప్రముఖ కమెడియన్ అరెస్ట్

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ఓ యువతిని మోసం చేశాడనే కారణంగా జబర్దస్త్ కమెడియన్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... జబర్దస్త్ షో సద్దాం టీంలో కమెడియన్‌గా చేస్తున్న నవ సందీప్ యువతిని మోసం చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నవ సందీప్ తనని మోసం చేశాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్నిఅరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

 jabardasth

హైదరాబాద్‌ హాస్టల్‌లో ఉంటున్న అమ్మాయితో నవ సందీప్ గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. గ్రామంలో నివాసం ఉంటున్న అమ్మాయిని హైదరాబాద్‌కు పిలిపించి మరి నవ సందీప్ ఆమెతో ప్రేమాయాణం సాగించాడు. ఈ క్రమంలో తరచుగా నవ సందీప్ ఆ అమ్మాయిని కలిసేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లపాటు వీరి ప్రేమయాణం బాగానే సాగింది.అయితే పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మాట దాటవేయడంతో నవ సందీప్‌పై ఆ యువతికి అనుమానం వచ్చింది.

 jabardasth

నవ సందీప్‌ ప్రవర్తనలో మార్పును గమనించిన ఆ యువతి..పెళ్లి గురించి నిలదీయడంతో...తాను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా చెప్పి ఆ యువతికి షాకిచ్చాడు. దీంతో నవ సందీప్‌ చేతిలో మోసపోయానని గుర్తించిన ఆ యువతి మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన సమాచారం మేరకు నవ సందీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నవ సందీప్‌ను విచారిస్తున్నారు.గతంలో పలువురు జబర్దస్త్ ఆర్టిస్టులు పలు కేసుల్లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+