నాన్న కాదు నరకాసురుడు: కుమారుడిపై తండ్రి మర్డర్ అటెంప్ట్, కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు..

తండ్రి మంచి మాటలు చెబుతుంటారు. తప్పు చేస్తే మందలిస్తారు. కానీ ఈ రోజుల్లో చేయి చేసుకోవడం కంటే చెప్పడమే మేలు. కానీ కొందరు ఎదిగిన కొడుకులపై కూడా చేయిచేసుకుంటున్నారు. కొన్ని చోట్ల హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే తండ్రి స్థానంలో ఉండి రెచ్చిపోతున్నారు. తాజాగా కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో అలాంటి ఘటనే వెలుగుచూసింది.

సరిగా చదవటం లేదని కొడుకుపై తండ్రి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో బాలు కుమారుడు చరణ్ ఆరో తరగతి చదువుకున్నాడు. గత రాత్రి బాలు ఇంటికి వచ్చే సమయానికి చరణ్ ఇంట్లో టీవీ చూస్తున్నాడు. చదవడం లేదని.. ఆవేశంతో ఊగిపోయిన బాలు కొడుకుపై టర్పెంటాయిల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన చరణ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

father murder attempt to son in kphb colony

అసలే కరోనా.. స్కూల్స్/ కాలేజీలు లేవు. ఆన్ లైన్ క్లాసులు అంతంతమాత్రం జరుగుతున్నాయి. చెప్పే 30 నిమిషాలు కూడా ఇట్టే గడచిపోతోంది. కానీ కుమారుడు చదవడం లేదని టర్పెంటాయిల్ పోసి నిప్పంటించడంపై విద్యార్థి సంఘాలు భగ్గమన్నాయి. తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

కేపీహెచ్‌బీలో జరిగిన ఘటన కలకలం రేపింది. చదువుకోవడం లేదని కుమారుడిపై ఇలా ప్రవర్తించడం ఏంటీ అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. మంచి విషయాలు చెప్పాలే కానీ.. ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. టీవీ చూస్తున్నావని మందలించాలీ కానీ.. హత్యాయత్నం చేయడం తగదన్నారు. ఇలాంటి ఘటనలు ఇతరులను ప్రేరేపిస్తాయని మరికొందరు అంటున్నారు. కానీ తండ్రి బాలు చేసిన దాడిని పలువురు విమర్శిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+