తండ్రి దొంగ.. తనయుడు పోలీస్..! ఫన్నీ వీడియో వైరల్

హైదరాబాద్ : తండ్రి దొంగ.. తనయుడు పోలీస్.. ఇదేదో నిజంగా కాదండీ. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన ఫన్నీ సన్నివేశం అన్నమాట. చిన్నపిల్లలకు సాధారణంగా ఏమి తెలియదని అనుకుంటాం. కానీ వాళ్ల ఆబ్జర్వేషన్ యమ ఫాస్ట్‌గా ఉంటుందనే విషయం ఈ వీడియో చూస్తే బోధపడుతుంది.

పెద్దలు చెప్పింది నేర్చుకుని పిల్లలు అనుసరిస్తుంటారు. ఇదంతా కామన్. కానీ చైనాలో ఓ బుడ్డోడు మాత్రం తన తండ్రిని దొంగలా పట్టేశాడు. తిప్పికొడితే రెండేళ్లు కూడా నిండని సదరు బాలుడి ముందు అయ్యగారి తెలివి తెల్లారిపోయింది. ఈ వీడియో చూస్తే ఆ పిల్లోడి హావభావాలు కడుపుబ్బా నవ్విస్తాయి. కొడుకు తెలివి ముందు తండ్రి కళ్లు తేలేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.

 father thief son as police funny video viral

కరెంట్ బిల్లుల్లో మోసం.. 30 రోజులు మించి బిల్లింగ్‌.. ఆ ప్రచారం నమ్మొద్దంటూ..!

ఎవరైనా అల్లరి ఎక్కువ చేస్తే పిల్లలు కాదు పిడుగులు అంటుంటారు. అలాంటి కోవలోకే వస్తాడు ఈ వీడియోలోని గడుగ్గాయి. తన తండ్రి భుజంపై పడుకున్న బాలుడు తన తండ్రి ఐస్‌క్రీమ్ తింటున్న వాసన పసిగట్టేస్తాడు. అయితే ఆ పిల్లోడు లేచి చూసేసరికి తండ్రి ఐస్‌క్రీమ్ వెనుకవైపు దాచిపెడతాడు. ఆ క్రమంలో తండ్రి నోరు దగ్గర వాసన పసిగట్టేస్తాడు.

అలా మరోసారి తండ్రి భుజంపై వాలిపోతాడు. ఈసారి తండ్రి కాస్తా ఎక్కువగా ఐస్‌క్రీమ్ లాగించేస్తాడు. మళ్లీ ఆ పిల్లోడు లేచేసరికి ఐస్‌క్రీమ్ ఎప్పటిలాగే వెనక్కి పెట్టేస్తాడు. దాంతో ఆ పిల్లోడు మరోసారి తండ్రి నోరు వాసన చూస్తాడు. తనకు తెలియకుండా ఐస్‌క్రీమ్ తిన్నాడని భావిస్తాడో ఏమోగానీ తండ్రి చెంపలు వాయించేస్తాడు. సో, అలా తనయుడి చేతికి తండ్రి దొంగలా దొరికిపోతాడన్నమాట. మీరు కూడా ఈ వీడియో చూసి కాసేపు నవ్వుకోండి. పిల్లలే కదా అని తేలిగ్గా తీసిపారేసే రోజులు పోయాయనడానికి ఇదో మంచి ఉదాహరణ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+