Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరోనా భయంతో రిటైర్డ్‌ జడ్జి ఆత్మహత్య - ఫ్యామిలీకి అంటొద్దనే - మియాపూర్‌లో ఘటన

కరోనా భయం ప్రజలను ఇంకా వెంటాడుతోంది.. దేశంలో కొవిడ్-19 పేషెంట్ల రికవరీ రేటు 80 శాతానికిపైగా ఉన్నప్పటికీ.. చదువుకున్నవాళ్లు సైతం బెంబేలెత్తిపోతున్నారు.. తాజాగా కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో ఓ రిటైర్డ్‌ జడ్జి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని మియాపూర్ లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

జడ్జిగా రిటైరైన రామచంద్రారెడ్డి మియాపూర్‌లోని న్యూసైబర్‌ హిల్స్‌లో కుటుంబంతో కలసి నివసిస్తున్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన.. తనకు కరోనా లక్షణాలు ఉన్నాయేమోనన్న భయంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. గురువారం రాత్రి కుటుంబంతో సహా డిన్నర్ చేసిన తర్వాత, తన బెడ్ రూమ్ లోకి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఎంతకీ తలుపు తెరవకపోవడంతో కుటుంబీకులు కంగారుతో తలుపులు బద్దలు కొట్టగా..

fearing-covid-19-retired-judge-ramachandra-reddy-commits-suicide-in-hyderabad

సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని విగత జీవిగా రామచంద్రారెడ్డి కనిపించారు. వెంటనే అతణ్ని ఆస్పత్రికి తీసుకుపోగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. దీనిపై జడ్జి కుటుంబం మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి గదిని పరిశీలించిన పోలీసులకు అక్కడో సూసైడ్ నోట్ లభించింది. అందులో..

తనకు కరోనా సోకిందని భయంగా ఉందని, తన వల్ల ఇంట్లో ఉన్న కుటుంబసభ్యలుకు కరోనా సోకకూడదనే ఉద్దేశంతోనే ఆత్యహత్యకు పాల్పడుతున్నట్లు రామచంద్రారెడ్డి సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. జడ్జి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మియాపూర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ జడ్జికి కరోనా ఉందా, లేదా అనే విషయం వెల్లడికావాల్సి ఉంది.

తెలంగాణ ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2009 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంక్య 1.95లక్షలకు, మరణాల సంఖ్య 1145కు పెరిగింది. ఇప్పటివరకు కొవిడ్ బారి నుంచి 1.65లక్షల మంది కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 28,620గా ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+