బర్త్‌డే పార్టీలో పైశాచికత్వం: ఆ సింగర్ పై అత్యాచారయత్నం... నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ..!
హైదరాబాద్: పార్టీల పేరుతో అరాచకాలు జరుగుతున్నాయి. తాగిన మైకంలో ఒళ్లు తెలియక ప్రవర్తిస్తున్నారు కామాంధులు. పార్టీల్లో తాగడం తందనాలు ఆడటం ఆ తర్వాత అమ్మాయి కనిపిస్తే ఆమెపై కామంతో కాటేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.

మద్యం మత్తులో..
రాజేంద్రనగర్‌లో కొందరు కలిసి బర్త్‌డే పార్టీ జరుపుకున్నారు. ఆ పార్టీ ఒక ఫ్లాట్‌లో జరిగింది. బర్త్‌డే పార్టీకోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకునేందుకు ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ కు అప్పగించారు. ఈ కంపెనీ ఫ్లాట్‌ను అలంకరించింది. అంతేకాదు ఆర్కెస్ట్రాను కూడా అరేంజ్ చేసింది. బర్త్‌డే బాయ్ ఆమిర్ వచ్చాడు. కేక్ కట్ చేశాడు. ఇక పార్టీ షురూ అయ్యింది. ముందుగా ఒక పెగ్గు తాగారు .అనంతం మరో పెగ్గు ఇలా పెగ్గు మీద పెగ్గు మద్యం సేవించే సరికి కళ్లు ఒళ్లు తెలియలదే. బర్త్‌డే పార్టీ కాబట్టి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఓ సింగర్‌ను కూడా ఏర్పాటు చేసింది. మైకు అందుకుని మంచి పాటలు పాడింది ఆ సింగర్. ఇక పార్టీకి వచ్చిన వారు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.

మహిళా సింగర్‌పై పడ్డ కన్ను
అంతవరకు బాగానే కూల్‌గా సాగిన బర్త్‌డే పార్టీలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఫుల్‌గా మందు కొట్టిన బర్త్‌డే బాయ్ ఆమిర్ అతని స్నేహితుల కన్ను పాట పాడుతున్న అమ్మాయిపై పడింది. ఇంకేముంది ఆమెను డ్యాన్స్ చేయాల్సిందిగా కోరారు. అది కూడా నగ్నంగా డ్యాన్స్ చేయాలని దుర్మార్గులు కోరారు. పార్టీ ఒక్కసారిగా నిలిచిపోయింది. నలుగురు స్నేహితులు అమ్మాయిని చుట్టుముట్టి ఆమెపై అత్యాచారం చేయబోయారు. ఇది చూసిన మహిలా ఈవెంట్ మేనేజర్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆమెపై కూడా కన్నేసిన కామాంధులు ఇద్దరినీ తీసుకెళ్లి ఓ గదిలో బంధించారు.

అడ్డుకోబోయిన మహిళా ఈవెంట్ మేనేజర్‌పై కూడా...
ఇక వారిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. కత్తులతో ఇద్దరిని బెదిరించారు. అప్పటికే ఫుల్‌గా తాగిన నలుగురు తూలుతుండటంతో వారి నుంచి ఎలాగో అలాగా తప్పించుకోవాలనే ప్రయత్నం చేశారు ఇద్దరు అమ్మాయిలు. కానీ అది సాధ్యపడలేదు. ఇద్దరినీ గదిలో నిర్బంధించారు. కొద్ది సేపటికి వారు నిద్రలోకి జారుకున్నారు. అప్పటికే తెల్లారిపోయింది. వెంటనే ఈ కామాంధుల నుంచి తప్పించుకున్న మహిళలు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశారు. అక్కడ ఫిర్యాదు చేయడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు బర్త్‌డే బాయ్ ఆమిర్‌తో పాటు మజార్ అలీ, సల్మాన్, సులేమాన్ అనే ముగ్గురుని కూడా అరెస్టు చేశారు. వారిపై అత్యాచారయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పార్టీలకు వెళ్లిన సమయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. వీలైనంత వరకు పార్టీని త్వరగా ముగించుకుని ఇళ్లకు చేరే ప్రయత్నం చేయాలని చెప్పారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications