విషాదం: ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ కన్నుమూత.. గుండెపోటుతో మృతి
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ ఎల్‌ఎం చనిపోయారు. కార్డియాక్ అరెస్ట్ తో కౌశిక్ కన్నుమూశారు. కౌశిక్ మృతితో సినీపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తోటి క్రిటిక్స్, చిత్ర ప్రముఖులు కౌశిక్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ట్విట్టర్ ఖాతా ద్వారా బాక్సాఫీస్ రిపోర్టులు, సినిమా అప్‌డేట్ అందించడంలో కౌశిక్ పేరు పొందారు. సినిమా అప్‌డేట్‌లను పొందడానికి చాలా కాలంగా అతనిని అనుసరిస్తున్న ట్విట్టర్ వినియోగదారులకు కౌశిక్ ఇక లేడు అనే వార్త షాక్‌నకు గురి చేసింది. "సీతారామం" చిత్రానికి సంబంధించి 7 గంటల క్రితం కూడా అతను ట్వీట్ అప్‌లోడ్ చేశాడు.

మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్‌లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తోటి సినిమా ట్రాకర్లు, థియేటర్ యజమానులు, ప్రముఖులు మరియు సినీ సమీక్షకులు కౌశిక్ మృతికి సంతాపం తెలిపారు. సినిమా ట్రాకింగ్‌తో పాటు, సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే వాడు కౌశిక్. అతని తెలివైన ప్రశ్నలకు, స్టార్లతో అతడు మాట్లాడే విధానం చాలామందికి నచ్చింది. దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ఫాలోవర్లు కలిగున్న గలాట్టా యూట్యూబ్ ఛానెల్ కోసం ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు.
కౌశిక్ మరణాన్ని గలాట్టా యూట్యూబ్ ఛానెల్ ధృవీకరించింది. ప్రఖ్యాత సినీ విమర్శకుడు, మూవీ ట్రాకర్ మరియు గలాట్టా VJ @LMKMovieManiac గుండెపోటు కారణంగా మరణించారు. ఆయన మరణం తమకు వ్యక్తిగతంగా తీరని లోటు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని ట్వీట్ చేసింది. ఈ మధ్య పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించారు.












Click it and Unblock the Notifications