అన్నపూర్ణ స్టూడియోస్‌లో అగ్నిప్రమాదం.. బిగ్‌ బాస్ హౌజ్ సెట్‌ పరిస్థితేంటి..?

హైదరాబాదు: హైదరాబాదులో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వెంటనే రంగంలోకి దిగింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ సినిమా చిత్రీకరణ కోసం వేసిన సెట్‌లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు సమాచారం. అయితే ఏమేరకు నష్టం వాటిల్లిందనేది ఇంకా అంచనా వేయాల్సి ఉంది.

Recommended Video

    #Annapurnastudios : అన్నపూర్ణ స్టూడియో సెట్‌లో షార్ట్ సర్క్యూట్.. ఎగసిపడ్డ మంటలు!

    ఇదిలా ఉంటే 2017 నవంబర్‌లో కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మనం సినిమా కోసం వేసిన సెట్‌ నుంచి మంటలు చెలరేగడంతో రూ.2 కోట్లు మేరా నష్టం కలిగింది. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ చూస్తున్నారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ -4కు సంబంధించి సెట్ వేయడం జరిగింది. బిగ్‌బాస్ హౌజ్ సెట్‌కు సమీపంలోనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    Fire Accident in Hyderabad Annapurna studios, No casualities reported

    అన్నపూర్ణ స్టూడియోస్‌ను 1975లో స్థాపించారు. ప్రస్తుతం దీన్ని అక్కినేని నాగార్జున నడుపుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఎన్నో సినిమాలు, సీరియల్స్‌ షూటింగ్ జరుగుతాయి. అంతేకాదు ఇందులో బ్యాక్ఎండ్ కూడా జరుగుతుంది. డబ్బంగ్, ఎడిటింగ్, ఔట్‌డోర్ సెట్లు, ఇతర సదుపాయాలు కూడా ఈ స్టూడియోలో ఉన్నాయి. ఇక్కడ పలు ఇతర భాష చిత్రాలు కూడా చిత్రీకరణ జరుపుకున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+