తెలంగాణ పర్యాటక భవన్‌​లో భారీ అగ్ని ప్రమాదం: కీలక పత్రాలు బుగ్గిపాలు, కుట్రే అన్న నారాయణ

హైదరాబాద్: హిమాయత్‌నగర్‌లోని తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. పర్యాటక శాఖ కార్యాలయ సిబ్బంది సమాచారం అందించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.

షార్ట్​ సర్క్యూట్​ కారణంగానే మంటలు సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.ఈ ప్రమాదంలో అడ్మినిస్ట్రేషన్​ బ్లాక్​లోని ఫైల్స్​, ఫర్నీచర్​, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. మరోవైపు, మంటలు చెలరేగినప్పుడు కార్యాలయం కింద ఉన్న రెండు ఇన్నోవా కార్లపై అగ్ని కీలలు పడటంతో అవి కూడా పూర్తిగా కాలిపోయాయి.

fire accident in telangana tourism bhavan, key documents burned: narayana slams brs govt

ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగపోయినా భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. నారాయణగూడ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కావాలనే ఎవరైనా నిప్పు పెట్టారా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై పలు పార్టీల నేతలు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఎన్నికల కోడ్​ ఉల్లఘించిన పర్యాటక శాఖ ఎండీ మనోహర్ ​రావును ఇటీవలే ఎన్నికల కమిషన్​ సస్పెండ్​ చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్, సీపీఐ నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అగ్ని ప్రమాదం జరిగిన మొదటి అంతస్తును సందర్శించి పరిశీలించారు.

అనంతరం ఈ అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగా మాత్రమే జరిగినట్లు నారాయణ అభిప్రాయపడ్డారు. అడ్మినిస్ట్రేషన్​ బ్లాక్​లోని కీలకమైన ఫైల్స్​ ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందనే కారణంతోనే ఈ ప్రమాదాన్ని సృష్టించినట్లు నారాయణ ఆరోపించారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం అవినీతి బాగోతం బట్టబయలు కాకుండా కుట్ర చేస్తున్నారన్నారు.

ఇటీవల పర్యాటక శాఖ ఎండీ మనోహర్​ రావు బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి ఊడిగం చేయడం వల్లే ఎన్నికల కమిషన్​ ఆయనను సస్పెండ్​ చేసినట్లు నారాయణ గుర్తు చేశారు. ఈ ప్రమాదంలో ఆయన ప్రమేయంపై కూడా విచారణ చేయాలని నారాయణ కోరారు. అలాగే ఘటనపై హైలెవెల్​ ఎంక్వయిరీ వేయించాలని, అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+