Hyderabad: హైదరాబాద్‍లో ఐదు కొత్త పర్యాటక ప్రాంతాలు.. అవి ఏమిటంటే..!

హైదరాబాద్‍లో ఐదు కొత్తగా ఐదు పర్యాటక ప్రాంతాలు వెలిశాయి

హైదరాబాద్ లో చార్మినార్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు వివిధ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఈ పర్యటక ప్రాంతాలు చూసేందుకు నగరానికి ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. తెలంగాణ పర్యాటక రంగం గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతోంది. నగరంలోని కొత్త పర్యాటక ప్రాంతాలు మీకోసం..

బన్సీలాల్ పేట్ స్టెప్ వెల్

బన్సీలాల్‌పేట్‌లోని 17వ శతాబ్దపు పాత స్ట్రెప్‌వెల్ ఇప్పుడు పునరుద్ధరించారు. ఈ బావి అద్భుతమైన మేక్ఓవర్, లైట్లు ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. కొత్తగా పునరుద్ధరించన ఈ మెట్ల బావిని చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు. ఈ ప్రాంతం ఈ రోజుల్లో ప్రముఖ సెల్ఫీ పాయింట్‌గా మారింది.

మల్కం చెరువు పార్కు

మల్కం చెరువు పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధితో పశ్చిమ హైదరాబాద్‌కు కొత్త పర్యాటక కేంద్రంగా మారింది. నగరంలోని రాయదుర్గం సరస్సును గ్రీన్ పార్క్‌తో పునరుద్ధరించారు. దానికి 'మల్కం చెరువు పార్క్' అని పేరు పెట్టారు. సుమారు 50 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ పార్క్ పిల్లల కోసం కార్యకలాపాలు, నడక స్థలం, పచ్చని ఉద్యానవనాలను అందిస్తుంది. పార్క్ వెలుపల ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి.

గండిపేట్ పార్క్

ఉస్మాన్ సాగర్‌లోని ఈ ల్యాండ్‌స్కేప్ పార్క్ ఇటీవలే ప్రారంభించారు. ఎకో-పార్కు పర్యాటకుల రద్దీని చూస్తోంది. HMDA సుమారు 30+ కోట్లు వెచ్చించి 18 ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేసింది. గండిపేటలోని ఈ పార్కులో ఇన్ఫినిటీ పూల్, అక్వేరియం, విలాసవంతమైన చెక్క కాటేజీలు, క్యాంపింగ్ టెంట్లు, ఏవియరీ, సీతాకోకచిలుక తోట వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చూడవచ్చు.

దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ పార్క్ & కేబుల్ బ్రిడ్జ్

దుర్గం చెరువు వద్ద ఉన్న కేబుల్ వంతెన హైదరాబాదీలకు, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించే వారికి ప్రసిద్ధ ప్రదేశంగా మారింది. చాలా షూటింగ్ లు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కొంతమంది వ్యక్తులు రీల్స్, షార్ట్ వీడియోలు చేయడానికి వస్తున్నారు. సరస్సులో బోటింగ్ ఇతర వినోద కార్యక్రమాలను ఆనందించవచ్చు.

హుస్సేన్ సాగర్ లో మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్

హుస్సేన్ సాగర్‌లోని అతిపెద్ద మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ పర్యాటకులకు ఆకర్షణీయ ప్రదేశంగా మారింది. మ్యూజికల్ ఫౌంటెన్‌ను చూసేందుకు ఈ రోజుల్లో ప్రజలు ఎక్కువగా సాయంత్రం వేళల్లో హుస్సేన్ సాగర్‌ను సందర్శిస్తారు. సోషల్ మీడియా కూడా మ్యూజికల్ ఫౌంటెన్ చిత్రాలతో నిండిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+