Hyderabad: మార్గదర్శకాలు విడుదల చేసిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా..
హైదరాబాద్ లోని పలు హోటల్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అందుకే ఈ మధ్య తరుచుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సోదాల్లో చాలా లోపాలు బయటపడుతున్నాయి. అందుకే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) మార్గదర్శకాలను జారీ చేసింది. ఆహారం, సేవా సంస్థలలో పెరుగుతున్న కల్తీ దృష్ట్యా, సరైన వంటగది పరిశుభ్రత, పారిశుద్ధ్య విధానాలను అనుసరించకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) కమీషనర్ కె ఆమ్రపాలి ఆదేశించినట్లుగా మార్గదర్శకాలు విడుదల చేశారు.
50 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న అన్ని ఈటింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లు వంటగదుల్లో సీసీ కెమెరాలు అమర్చాలి. వాటిని GHMC ద్వారా అమర్చాలని సూచించారు. గుర్తింపు పొందిన విక్రేతల నుంచి ముడి పదార్థాలు కొనుగోలు చేయాలి. ముడి పదార్థాలు/మెటీరియల్ కొనుగోలు చేసేముందు తనిఖీ చేయాలన్నారు. ఇన్‌కమింగ్ మెటీరియల్, సెమీ లేదా ఫైనల్ ప్రొడక్ట్స్ క్షీణించకుండా FIFO, FEFO ప్రమాణాల ప్రకారం కాలుష్యం నుంచి రక్షించడానికి పరిశుభ్రమైన వాతావరణంలో వాటి ఉష్ణోగ్రత అవసరానికి అనుగుణంగా నిల్వ చేయాలి.

మాంసం ఆహారాలను డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ లేదా సమానమైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. ప్రాంగణంలో చీడపురుగుల(బొద్దింకలు, దోమలు), ఎలుకలు, పందికొక్కులు లేకుండా చూసుకోవాలి. ఆహార వ్యర్థాలు, ఇతర వ్యర్థాలు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఫుడ్ హ్యాండ్లర్ల వార్షిక వైద్య పరీక్షలు, టీకాలు వేయడం, వ్యక్తిగత శుభ్రత పాటించాలి. అలాగే మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. వంటే చేసేవారు గ్లౌజ్, క్యాప్, అఫ్రాన్ ధరించాలి.












Click it and Unblock the Notifications