Food Safety: వామ్మో.. అక్కడి వెళ్తున్నారా..!
కొద్ది నెలలుగా హైదరాబాద్ లోని రెస్టారెంట్లు, హోటళ్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో ఎన్నో దారుణాలు బయటపడుతున్నాయి. అయినప్పటికీ పలు రెస్టారెంట్లు, హోటళ్లు తీరు మార్చుకోవడం లేదు. అధికారుల తనిఖీల్లో ఘోర పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని చైతన్యపురి ప్రాంతంలోని రెండు ప్రముఖ రెస్టారెంట్‌లు, శిల్పి ఎలైట్ రెస్టారెంట్, బార్ అండ్ బహార్ బిర్యానీ కేఫ్‌లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్‌లోని శిల్పి ఎలైట్ రెస్టారెంట్ అండ్ బార్ FSSAI లైసెన్స్‌ను డిస్ ప్లే చేయలేదు. తనిఖీలో ఫుడ్ హ్యాండ్లర్‌లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు లేకపోవడం, అలాగే పెస్ట్ కంట్రోల్ రికార్డులు, నీటి విశ్లేషణ నివేదికలు కూడా కనిపించలేదు. వంటగది అత్యంత అపరిశుభ్రమైన స్థితిలో ఉంది. జిడ్డుగల పైకప్పులు, ఓపెన్ డ్రెయిన్లు, నిలిచిపోయిన ముగురు నీరు ఉంది. రిఫ్రిజిరేటర్ అపరిశుభ్రంగా ఉంది. కూరగాయల నిల్వ, రిఫ్రిజిరేటర్ ప్రాంతాలలో బొద్దింకలు కనిపించాయి.

𝗦𝗵𝗶𝗹𝗽𝗶 𝗘𝗹𝗶𝘁𝗲 𝗥𝗲𝘀𝘁𝗮𝘂𝗿𝗮𝗻𝘁 𝗮𝗻𝗱 𝗕𝗮𝗿, 𝗖𝗵𝗮𝗶𝘁𝗮𝗻𝘆𝗮𝗽𝘂𝗿𝗶
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) October 23, 2024
22.10.2024
* FSSAI license copy not displayed in the premises.
* Pest control records, Medical fitness certificates for food handlers and water analysis reports were not available with FBO.… pic.twitter.com/UCHT2tsGaU
టమాటాలు, కాకరకాయ కుళ్లిన స్థితిలో కనిపించాయి. సింథటిక్ ఫుడ్ కలర్స్ కూడా గుర్తించారు. ఫుడ్ కలర్స్ ఆహార తయారీలో ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.బహార్ బిర్యానీ కేఫ్‌లో కూడా ఇలాంటి ఉల్లంఘనలను గుర్తించారు. ఆహార భద్రత, పరిశుభ్రత పద్ధతులు చాలా నిర్లక్ష్యం చేశారు. మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు, నీటి విశ్లేషణ నివేదికలు కనిపించలేదు. ఓపెన్ డ్రెయిన్లు, నిర్వహణ సరిగా లేకపోవడంతో వంటగదిలో పురుగుల బెడద ఉంది. హాట్ పెప్పర్ సాస్, చాక్లెట్ ఫ్లేవర్ సిరప్ వంటి గడువు ముగిసిన ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి.
Task force team has conducted inspections in Chaitanyapuri area on 22.10.2024.
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) October 23, 2024
𝗕𝗮𝗵𝗮𝗿 𝗕𝗶𝗿𝘆𝗮𝗻𝗶 𝗖𝗮𝗳𝗲, 𝗖𝗵𝗮𝗶𝘁𝗮𝗻𝘆𝗮𝗽𝘂𝗿𝗶
* Medical fitness certificates for food handlers and Water analysis reports not available.
* No FoSTaC trainee available.
* Kitchen… pic.twitter.com/U36NGdGcSv
హైదరాబాద్ రెస్టారెంట్‌లో లేబుల్ లేని MSG, సింథటిక్ ఫుడ్ కలర్‌లను కూడా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ముడి చికెన్ సరిగ్గా నిల్వ చేయలేదు. రెస్టారెంట్ రిఫ్రిజిరేటర్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తంచారు. చైతన్యపురిలోని రెండు రెస్టారెంట్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు ఆహార భద్రత, ప్రమాణాల చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.
-
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
పొట్టు మినపప్పుతో రోటిపచ్చడి.. తింటే అసలే వదిలిపెట్టరు! -
"మిల్ మేకర్ బ్రెడ్ ఆమ్లెట్" ఇలా చేస్తే ముక్క కూడా వదలరు !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications