అర ఎకరం భూమి కోసం అమ్మనే కడతేర్చిన తనయుడు...!!

అర ఎకరం ఆస్థి కోసం కన్న తల్లినే చంపిన వైనం హైదారాబాద్‌లో వెలుగు చూసింది. తండ్రి మరణించిన తర్వాత తల్లిని,తమ్ముడి యోగ క్షేమాలను చూసుకోవాల్సిన ఓ అన్న అర ఎకరం భూమి కోసం ఏకంగా తల్లినే రాయితో కొట్టి చంపేశాడు. మైనర్ అయిన తమ్ముడికి ఆస్థి దక్కకుండా ప్లాన్ వేసిన నిందితుడు పోలీసుల విచారణలో కటకటాల పాలయ్యాడు.

ఆస్తి కోసం తల్లిని చంపిన కోడుకు

ఆస్తి కోసం తల్లిని చంపిన కోడుకు

సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం పన్యాల గ్రామానికి చెందిన బాలయ్య, మణెమ్మలకు నర్సింహా, మరియు శివ అనే ఇద్దరు కుమారులు. బ్రతుకు దెరువు కోసం హైదరాబాద్‌లోని చర్చ్‌గాగిల్లాపూర్ కూలిపనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. కాగా ఈ కుటుంభానికి తన స్వంత గ్రామంలో అరఎకరం వ్యవసాయ పోలం ఉంది. బ్రతుకు బండి ఈడ్చలేక నగరానికి చేరుకున్నకున్న కుటుంభానికి చేదు అనుభవం ఎదురైంది..కూలి పనులు చేసుకుంటున్న సంధర్భంలోనే బాలయ్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.

పోలం అమ్మాలని తల్లిపై ఒత్తిడి

పోలం అమ్మాలని తల్లిపై ఒత్తిడి

ఇక అప్పటి నుండి పెద్ద కుమారుడు నర్సింహ గ్రామంలో ఉన్న పోలాన్ని అమ్మి వేయాలని తల్లి మణెమ్మపై ఒత్తిడి తెచ్చాడు. అయితే తన రెండవ కుమారుడు శివ మైనర్ కావడంతో పాటు ఒకవేళ భూమి అమ్మితే చిన్నకుమారుడి భవిష్యత్ నాశనమవుతుందని తల్లి భావించింది. దీంతో పెద్ద కుమారుడు చెప్పిన విధంగా భూమిని అమ్మేందుకు నిరాకరించింది. ఈనేపథ్యంలోనే భూమి అమ్మలేదని కన్న తల్లిపై కక్ష పెంచుకున్న నర్సింహ ఆమేను చంపడానికే నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ప్లాన్ వేశాడు.

నిద్రిస్తున్న తల్లిపై రాయితో మోదిన తనయుడు

నిద్రిస్తున్న తల్లిపై రాయితో మోదిన తనయుడు

ఈనేపథ్యంలోనే ఈనెల 15న అర్థరాత్రి నిర్మాణంలో ఇంటిలో నిద్రిస్తున్న మణెమ్మపై నర్సింహపై కర్కశంగా వ్యవహారించాడు. నిద్రిస్తున్న తల్లిపై బండరాయితో మోదాడు. అనంతరం ఆమే అపస్మారకస్థితిలోకి వెళ్లింది. దీంతో పక్క ఇంటి వారిని పిలిచిన నర్సింహ అనారోగ్య కారణంతో ఉందని చెప్పాడు. అనంతరం 108 ఫోన్ చేసి రప్పించాడు. చికిత్స కోసం మణెమ్మను గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మణెమ్మ తలపై రాయితో బలంగా కొట్టడడంతో బలమైన గాయాలు అయ్యాయి. దీంతో ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నర్సింహను అదేరోజు అరెస్ట్ చేశారు. అయితే ఘటనలో నర్సింహకు మరోకరు కూడ సహకరించినట్టు విచారణలో తేలడంతో ఇద్దరిని పోలీసుల అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+