Indrakaran Reddy: అర్ధరాత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడి హల్‍చల్.. ఇద్దరికి తీవ్ర గాయాలు..!

ఆదివారం రాత్రి హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ ఫోరమ్ మాల్ సర్కిల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి కారు మరోకారును ఢీకొట్టడంతోపైటు ద్విచక్రవాహనాన్ని కూడా ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న అతనికి ఎడమ కాలు ఫ్రాక్చర్ కాగా, వెనకాల కూర్చున్న వ్యక్తి తలకు గాయమైంది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్‌రెడ్డి మద్యం సేవించి కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కేపీహెచ్‌బీ పోలీసులు అగ్రజ్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. అగ్రజ్ రెడ్డి మొతాదుకు మించి తాగి కారు నడిపిట్లు గుర్తించారు. డ్రైవర్ ఉన్నప్పటికీ అగ్రజ్ రెడ్డి అతన్ని పక్కనబెట్టి ఇష్టమొచ్చినట్లు కారు నడిపినట్లు తెలిసింది.

Former Minister Indrakaran Reddys nephew had a car accident after drinking alcohol

పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కారు ప్రమాద దృశ్యాల అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధుల కుటుంబాలకు చెందిన వారు తప్పతాగి వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా ఇదే తరహాలో అతివేగంగా వాహనం నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు.

కేసులో అతన్ని తప్పించడానికి యత్నించిన పోలీసులు అధికారులు సస్పెండ్ అయ్యారు. నిందితుడు దుబాయ్ పరారీ అయినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+