Formula E: మెరిసిన బ్రాహ్మణి, దేవాన్ష్: జూ.ఎన్టీఆర్ భార్యతో కలిసి సందడి..!!
హైదరాబాద్ లో ఫార్ములా-ఈ రేస్ కు సర్వం సిద్ధమైంది. శనివారం ఈ ప్రిక్స్ ప్రారంభం కానుంది. ఇవ్వాళ ప్రీ ప్రాక్టిస్ జరిగాయి. చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి, ఆమె కుమారుడు దేవాన్ష్, జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి దీనికి హాజరయ్యా
హైదరాబాద్: దేశంలో మొట్ట మొదటిసారిగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ఇది. విద్యుత్ ఆధారంగా నడిచే సింగిల్ సీటర్ కారును ఈ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం వినియోగిస్తారు. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఫార్ములా రేసింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్‌లల్లో మాత్రమే ఈ ఫార్ములా-ఈ రేసింగులు నడుస్తున్నాయి. వాటి సరసన హైదరాబాద్‌కు కూడా చేరింది.
రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్‌కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగులను నిర్వహించనుంది. తొలిసారిగా స్ట్రీట్ సర్క్యూట్ రేసింగ్ ఇది. హుస్సేన్ సాగర్ చుట్టూ 2.3 కిలోమీటర్ల సర్క్యుట్ ఓవర్ లుకింగ్‌పై ప్రత్యేకంగా రేసింగ్ ట్రాక్‌ను నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్, ఎన్టీఆర్ పార్క్, సంజీవయ్య పార్క్ మీదుగా ఈ రేస్ సాగుతుంది. రేస్ నడుస్తోన్న సమయంలో అవసరమైన పిట్ స్టాప్స్, ప్రేక్షకులు తిలకించడానికి వీలుగా సీటింగ్, ఫెన్సింగ్ నిర్మాణం అన్నీ పూర్తయ్యాయి.

మొత్తం 18 మలుపులతో ట్రాక్ ను నిర్మించారు. శనివారం ఈ గ్రాండ్ ప్రిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవ్వాళ ఫ్రీ ప్రాక్టీస్ సెషన్ జరిగింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఫ్రీ ప్రాక్టీస్ సెషన్ 45 నిమిషాల పాటు ఆలస్యంగా ఆరంభమైంది. నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం రోడ్డు నుంచి రేసింగ్ ట్రాక్ పైకి ద్విచక్ర వాహనదారులు చొచ్చుకుని వచ్చారు. గంటల తరబడి ట్రాఫిక్ ను నిలిపివేయడం వల్ల అసహనానికి గురయ్యారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లతో వాగ్వివాదానికి దిగారు.

ఈ ఫ్రీ ప్రాక్టీస్ సెషన్ ను తిలకించడానికి పలువురు ప్రముఖులు నెక్లెస్ రోడ్ కు చేరుకున్నారు. వారికోసం నిర్వాహకులు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీలను ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్.. సందడి చేశారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి తన స్నేహితులతో నెక్లెస్ రోడ్ కు చేరుకున్నారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలో వారందరూ ఒకే చోట కూర్చున్నారు.












Click it and Unblock the Notifications