• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

స్నేహం ముసుగులో న్యూడ్ వీడియోలు.. అమెరికా వెళ్లి అప్‌లోడ్..!

|

హైదరాబాద్‌ : నమ్మించి నయవంచనకు గురిచేసే మోసగాళ్లు పెరిగిపోతున్నారు. స్నేహం ముసుగులో యువతుల్ని ట్రాప్ చేస్తున్న మాయగాళ్లు ఎక్కువవుతున్నారు. ముగ్గులోకి దించి ఆపై అనైతికంగా వ్యవహరిస్తున్న పోకిరోళ్లు చెలరేగిపోతున్నారు. అదే క్రమంలో స్నేహం పేరిట ఓ హైదరాబాద్ యువతిని నమ్మించి న్యూడ్ వీడియోలు తీసిన ఘటన వెలుగుచూసింది. స్నేహితుడే కదా అని నమ్మితే మత్తులో ముంచి ఆపై పైశాచికంగా ప్రవర్తించిన యువకుడి గుట్టురట్టైంది.

స్నేహితుడని నమ్మితే.. ఇంత ఘోరమా..!

స్నేహితుడని నమ్మితే.. ఇంత ఘోరమా..!

హైదరాబాద్‌లోని ఓ ప్రాంతానికి చెందిన 24 సంవత్సరాల యువతికి 9 సంవత్సరాల కిందట కామన్ ఫ్రెండ్ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు. అయితే మూడు సంవత్సరాల కిందట ఆమె డిగ్రీ చదువుతున్న క్రమంలో వారిద్దరి మధ్య ఆ స్నేహం కాస్తా మరింత బలపడింది. అలా తరచుగా ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అంతేకాదు చాలాసార్లు కలిసి బయటకు వెళ్లారు. ఆ క్రమంలో అలాగే బయటకు తీసుకెళ్లిన సదరు యువకుడు ఆమెకు కూల్‌డ్రింక్ తాగించాడు. ఆమెకు తెలియకుండా అందులో మత్తుపదార్థాలు కలిపాడు.

అయితే ఆ కూల్‌డ్రింక్ సేవించిన యువతి మత్తులోకి జారుకుంది. అదే అదనుగా భావించిన యువకుడు ఆమెను నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి తన ఫోన్‌లో న్యూడ్ వీడియోలు తీశాడు. కొన్ని రోజులయ్యాక ఆ వీడియోలు ఆమెకు చూపించి బెదిరించే ప్రయత్నం చేశాడు. దాంతో ఆమె భయపడి అతడి ఫోనులో నుంచి డిలేట్ చేయాల్సిందిగా కోరింది. అయితే ఆయన వినిపించుకోలేదు.

 న్యూడ్ వీడియోలు తీసి.. బెదిరించి

న్యూడ్ వీడియోలు తీసి.. బెదిరించి

స్నేహం ముసుగులో ఆ అమ్మాయితో తిరిగిన సదరు యువకుడు తనలోని నీచ బుద్దిని బయటపెట్టాడు. ఆమె న్యూడ్ వీడియోలు తీయడమే గాకుండా బెదిరింపులకు గురిచేశాడు. అయితే అదే క్రమంలో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిపోయాడు. ఇక అక్కడకు వెళ్లాక తనలోని పైశాచికత్వాన్ని బయటపెట్టాడు. అలా ఆమె న్యూడ్ వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశాడు.

ఆయన వీడియోలు ఇంటర్నెట్‌లో గుర్తించిన ఆమె స్నేహితులు బాధితురాలికి విషయం వివరించారు. దాంతో అతడి కపట నాటకం బయటపడింది. చివరకు ఏమీ చేయాలో అర్థం కాక ఆమె రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో కేసు దర్యాప్తులో తలమునకలయ్యారు పోలీసులు.

విద్యార్థుల గ"మ్మత్తు"దందా.. చదువుకుంటూనే గలీజు పనులు..!

అశ్లీల వెబ్‌సైట్లలో ఆ వీడియోలు అప్‌లోడ్

అశ్లీల వెబ్‌సైట్లలో ఆ వీడియోలు అప్‌లోడ్

స్నేహితుడిగా నమ్మించి నయవంచనకు గురిచేసిన సదరు యువకుడు వివిధ అశ్లీల వెబ్‌సైట్లలో ఆమె వీడియోలు అప్‌లోడ్ చేశాడు. అయితే అతడు అమెరికాలో ఉండటంతో కేసు దర్యాప్తులో ముందడుగు వేయడానికి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. నిందితుడ్ని ట్రేస్ ఔట్ చేయడానికి ఏ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐడీ నుంచి వీడియోలు అప్‌లోడ్ అయ్యాయనే విషయంపై ఆరా తీస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There are a growing number of fraudsters who believe and heal. There are more and more illusions trapping young girls in the guise of friendship. Dumping into trap and then acting like an immoral rogue. In the same sequence, a video of Nude videos showing a Hyderabadi girl in the name of friendship emerged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more