Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

tweet viral:తమిళిసై- కేసీఆర్ మధ్య మరీ ఇంత గ్యాపా.? తీర్మాన్ మల్లన్న ట్వీట్, వైరల్

తెలంగాణ సీఎం కేసీఆర్- గవర్నర్ తమిళి సై మధ్య సఖ్యత లేదు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ఘర్షణ వాతారణ ఉంది. అయితే కొత్త హైకోర్టు సీజే పదవీ ప్రమాణ స్వీకారం మంగళవారం రాజ్ భవన్‌లో జరిగింది. కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. అయితే ఒక ఫోటో మాత్రం వైరల్ అవుతుంది. అందులో సీజే.. తమిళి సై.. ఎదురెదురుగా కూర్చొన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం ఆమడదూరంలో ఉన్నారు. దీనిని తీన్మార్ మల్లన్న ట్వీట్ చేశారు. సెటైరికల్‌గా కామెట్ చేశారు. ఆ ట్వీట్ ట్రోల్ అవుతుంది.

మరీ ఇంత గ్యాపా..?

హైకోర్టు నూత‌న ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉజ్జ‌ల్ భుయాన్‌ మంగ‌ళ‌వారం ప్రమాణ స్వీకరాం చేశారు. రాజ్ భ‌వ‌న్‌లో గవర్నర్ తమిళి సై ప్ర‌మాణ స్వీకారం చేయించారు. కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ కూడా హాజ‌ర‌య్యారు. సీజే ప్ర‌మాణ స్వీకారం ముగిసిన త‌ర్వాత తేనీటి విందులో త‌మిళిసై, కేసీఆర్‌, ఉజ్జ‌ల్ భుయాన్‌ పాల్గొన్నారు. తీసిన ఫొటోపై క్యూ న్యూస్ నెట్‌వ‌ర్క్ ఓనర్ తీన్మార్ మ‌ల్ల‌న్న సెటైరిక్ ట్వీట్ చేశారు. త‌మిళిసై, కేసీఆర్‌ల మ‌ధ్య గ్యాప్ ఉందని తెలుసు.. కానీ మరీ ఇంత అని తెలియదనిఆ ఫొటోకు త‌న కామెంట్‌ను జోడించారు.

నెటిజన్ల కామెంట్స్

నెటిజన్ల కామెంట్స్

నిజానికి ఫొటోలో సీజే, గ‌వ‌ర్న‌ర్‌ ఎదురెదురుగా ద‌గ్గ‌ర‌గా కూర్చున్నా.. వారిద్దిరికి మ‌ధ్య‌లో అల్లంత దూరాన కేసీఆర్ కూర్చున్నారు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ తీన్మార్ మ‌ల్లన్న సెటైర్ సంధించారు. తీన్మార్ మ‌ల్ల‌న్న పోస్ట్ చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారిపోయింది. సీఎం, చీఫ్ జస్టిస్ ఒక్కరే, కానీ గవర్నర్ వెనుక సెక్యూరిటీ గార్డ్.

అది రాజ్యాంగ పదవీ గౌరవం. అందరం గౌరవించాలి ఏది ఏమైనా అంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మరింత దూరం పెడతారు సార్‌ను అంటూ మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఇక కొంద‌రైతే ప‌లు ర‌కాల మీమ్‌ల‌తో ట్వీట్‌ను మ‌రింత‌గా వైర‌ల్‌ చేస్తున్నారు.

ఇదీ నేపథ్యం

ఇదీ నేపథ్యం

కేసీఆర్, తమిళి సై మధ్య.. పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ అంశంతో రగడ నెలకొంది. ఎమ్మెల్సీ ఖరారు చేయకపోవడంతో కేసీఆర్ ఆగ్రహాంతో ఉన్నారు. ఇక అప్పటినుంచి ఉప్పు, నిప్పుగా ఉన్నారు. అంత ఎందుకు అధికార కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. జెండా వందనానికి కూడా రాజ్ భవన్ వెళ్లలేదు.

గవర్నర్ యాదాద్రికి వెళ్లిన ప్రోటోకాల్ పాటించలేదు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. అయినప్పటికీ ప్రభుత్వం మిన్నకుండిపోయింది. కేంద్ర హోం మంత్రికి కూడా ఫిర్యాదు చేశారు. అంతా స్తబ్దుగానే ఉంది. ఇప్పుడు ఇద్దరు కలిశారు.. కానీ దూరం పాటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+