హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వలింగ సంపర్కం: యువకుడితో అధికారి రూ.5 వేలకు అగ్రిమెంట్, ..అని తెలియడంతో గొడవ..

|
Google Oneindia TeluguNews

స్వలింగ సంపర్కం.. ఇష్టపూర్వకంగా జరిగే సెక్స్‌కు సుప్రీంకోర్టు కూడా అనుకూల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందుకోసం నగదు, వేధింపుల ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులకు పట్టుబడ్డ సదరు అధికారి.. ఓ అధికారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. జరిగిన ఘటనను స్థానిక పోలీసులు వివరించారు.

స్వలింగ సంపర్కుడు..

స్వలింగ సంపర్కుడు..

వనస్థలిపురానికి చెందిన అధికారి స్వలింగ సంపర్కుడు. తాను రకరకాలుగా సంపర్కం చేసుకుంటేవాడు. అయితే ఇటీవల గూగుల్ చాట్ పోర్టల్‌లో బాపూనగర్‌కి చెందిన యువకుడి ఫోన్ నంబర్ సంపాదించాడు. అతనితో చాట్ చేశాడు. సెక్స్ గురించి డిస్కస్ చేశారు. తనను సంతృప్తి పరిస్తే రూ.5 వేలు ఇస్తానని చెప్పాడు. ఆ యువకుడు నగదుకు ఆశించి అంగీకరించాడు. యువకుడు ఉంటోన్న లోకేషన్ కూడా షేర్ చేశాడు. దీంతో ఆ అధికారి లోకేషన్ వద్దకు వచ్చాడు.

తెల్లవారుజామున 3 గంటలకు..

తెల్లవారుజామున 3 గంటలకు..

మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆ అధికారి ఎస్ఆర్ నగర్ స్టాచ్యూ వద్దకు వచ్చాడు. యువకుడికి ఫోన్ చేసి.. అతను ఉంటోన్న రూమ్‌కు వెళ్లాడు. అయితే అక్కడ యువకుడు దివ్యాంగుడు అని చూశాడు. అక్కడినుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించగా.. యువకుడు ప్రతిఘటించాడు. యువకుడు, అతను అరవడంతో గొడవ జరిగింది. అరుపులు విన్న చుట్టపక్కల వారు డయల్ 100కి కాల్ చేశారు. వెంటనే పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇద్దరిని పోలీసు స్టేషన్ తరలించారు.

Recommended Video

India - Japan : చైనాకు బుద్ధి చెప్పేలా.. Japan తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్ ! || Oneindia
న్యూసెన్స్ కేసు

న్యూసెన్స్ కేసు

అధికారి, యువకుడిపై న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. ఇష్టపూర్వక శృంగారానికి అనమతి ఉన్నా.. అరుపులతో విషయం బయటకు పొక్కింది. గొడవ వల్ల ఇద్దరినీ పోలీసులు స్టేషన్ తీసుకెళ్లారు. వారిద్దరినీ ఏం జరిగిందని ఆరాతీయగా.. విషయం వెలుగులోకి వచ్చింది. స్వలింప సంపర్కం నేపథ్యంలోనే అధికారి యువకుడి గదికి వచ్చాడని తెలిసింది.

English summary
gay sex: officer agreement youth in hyderabad sr nagar. police arrested two people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X