విజేత సూపర్ మార్కెట్‌ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్: ఎందుకంటే?

హైదరాబాద్: పరిసరాల పరిశుభత్ర పాటించని ఓ సూపర్ మార్కెట్‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) షాకిచ్చింది. రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్‌గూడలో విజేత సూపర్ మార్కెట్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సీజ్ చేశారు. రాజేంద్రనగర్‌లో అధికారులతో కలిసి మంగళవారం పర్యటించారు.

ఈ క్రమంలో ఆయన ముందే చెత్తను రోడ్డుపై పడేశారు విజేత సూపర్ మార్కెట్ సిబ్బంది. దీంతో సీరియస్ అయిన రోనాల్డ్ రాస్.. వెంటనే ఆ సూపర్ మార్కెట్‌ను సీజ్ చేసి రూ. 50 వేలు జరిమాణా విధించారు. దీంతో పరిశుభ్రతను పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని సంకేతాలిచ్చారు.

vijetha supermarket in Rajendra Nagar, Hyderabad

కాగా, హైదరాబాద్ నగరంలో విజేత సూపర్ మార్కెట్లు సుపరిచితమే. సామాన్యల నుంచి ధనికుల వరకు ఈ మార్కెట్లలో నిత్యావసరాలతోపాటు తదితర వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. అయితే, విజేత సూపర్ మార్కెట్ గతంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి వార్తల్లో నిలిచింది. మదీనాగూడ, చందానగర్ ప్రాంతాల్లో ఉన్న విజేత సూపర్ మార్కెట్లలో ఓకే సమయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు.

అధికారుల సోదాల్లో నిర్వాహకులు స్టోర్‌లో నాసీరకం పదార్థాలను విక్రయిస్తున్నట్లు గుర్తించి చర్యలు తీసుకున్నారు. మరోవైపు, ఇటీవల నాణ్యతలేని ఆహారపదార్థాలను అందించని కారణంగా సికింద్రాబాద్ అల్ఫా హోటల్‌ను కూడా అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఇది ఇలావుంటే, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో ఉన్న కరాచీ బేకరీ బ్రాంచ్‌పై ఫిర్యాదు మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) అధికారులు పరిశీలించారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్‌లోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO) బి శ్రీవెనక.. కరాచీ బేకరీని తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో, అనుమానిత నమూనాలను విశ్లేషణ కోసం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి చర్యల నిమిత్తం తనిఖీ నివేదికను సమర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+