GHMC Election Results 2020: స్వస్తిక్‌తోపాటు ఏ గుర్తు ఉన్న ఓటే, అర్థరాత్రి ఉత్తర్వులు, అభ్యంతరం..

గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్వస్తిక్ గుర్తే కాక ఇతర గుర్తు కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ స్పష్టంచేసింది. ఈ మేరకు అర్ధరాత్రి ఎస్ఈసీ పార్థసారథి ఉత్తర్వులు జారీచేశారు. కౌంటింగ్‌కు కొన్ని గంటల ముందు ఆర్డర్స్ ఇవ్వడం చర్చకు దారితీసింది. దీనిని విపక్షాలు తప్పుపడుతున్నాయి. బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.

 స్వస్తిక్‌తోపాటు ఏ ముద్రా ఉన్నా..

స్వస్తిక్‌తోపాటు ఏ ముద్రా ఉన్నా..

గ్రేటర్ ఓట్ల లెక్కింపులో స్వస్తిక్ ముద్రతోపాటు ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలనే ఎన్నికల సంఘం ఉత్తర్వులపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ నేతలు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కాసేపట్లో హైకోర్టు విచారించనుంది. అయితే 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా హైకోర్టు కూడా కౌంటింగ్‌ను ఆపలేదని నిపుణులు చెబుతున్నారు.ఎన్నికల సంఘానికి రాజ్యాంగం ఆ మేరకు హక్కులు కల్పించిందని మేధావులు తెలిపారు. అవసరమైతే ఆ గుర్తులు ఉన్న చోట తిరిగి ఎన్నికలు జరపాలని కోర్టు కోరచ్చు కానీ.. కౌంటింగ్ నిలిపివేయాలని కోర్టు కోరవని స్పష్టంచేస్తున్నారు.

అర్ధరాత్రి సర్క్యులర్ ఏంటీ..?

అర్ధరాత్రి సర్క్యులర్ ఏంటీ..?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారతి అర్ధరాత్రి సర్క్యులర్ ఇవ్వడం ఏంటీ అని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు . బ్యాలెట్ లో స్వస్తిక్ గుర్తు ఉండాలి కానీ, స్వస్తిక్ గుర్తు తో పాటు ఎలాంటి మార్క్ ఉన్నా ఓటు వేసినట్లు గానే పరిగణించాలని అర్ధరాత్రి ఎన్ని కల కమిషనర్ పార్థసారథి సర్క్యులర్ ఇవ్వడం సరికాదన్నారు. కౌంటిం గ్ కు కొన్ని గంటల ముందు సర్క్యులర్ ఇవ్వడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ఎస్ ఈ సీ పార్థసారథి గ్యాంబ్లర్ గా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ ఈసీ ఇచ్చిన సర్క్యులర్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు బీజేపీ ఎంత దూరమైన వెళ్తుందన్నారు.

గంటలో ఎలా పెరిగింది

గంటలో ఎలా పెరిగింది

పోలింగ్ రోజు సాయంత్రం 5 నుం చి 6 గంటల మధ్య జరిగిన పోలింగ్ లో ఏదో తేడా ఉందని, గంటలోనే పోలింగ్ శాతం ఎలా పెరిగిందని బండి సంజయ్ ప్రశ్నించారు. దీనిపై అనుమానాలు ఉన్నాయన్నారు . అనుమానాలు నిజమయ్యేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అర్ధరాత్రి జారీ చేసిన సర్క్యులర్ ను చూస్తే తెలుస్తోంది. సీఎం కేసీఆర్ చెప్పి నట్లుగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నడుచుకుంటున్నారని.. ప్రజలు వాస్తవాలు గ్రహించాలని కోరారు. పోలింగ్ రోజు అర్ధరాత్రి సీఎస్ , డీజీపీ, జీహెచ్ ఎంసీ కమిషనర్ , ఇతర ఆఫీసర్లు మీటింగ్ పెట్టుకొని టీఆర్ఎస్ గెలిచేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+