డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికలు..? రెండు, మూడురోజుల్లో నోటిఫికేషన్..
జీహెచ్ఎంసీ ఎన్నిక నగారా మోగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చేనెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీపావళి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తుండగా.. ఇటు రాజకీయ పార్టీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. విజయంపై ప్రధాన పార్టీలు అప్పుడే ధీమా వ్యక్తం చేశాయి.
డిసెంబర్ మొదటి వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ పార్టీ భావిస్తోంది. దుబ్బాక ఎన్నికలో అధికార పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్ట్ పడక ముందే గ్రేటర్ ఎన్నికలు జరపాలని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎలక్షన్ కమిషన్ గురువారం సమావేశం కానుంది. ఎన్నికల నిర్వహణ, ఓటర్ లిస్ట్, వార్డులపై చర్చిస్తోంది.

పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య ఈసీ పరిశీలించింది. ఎన్నికల కోసం సిబ్బందికి శిక్షణను కూడా పూర్తి చేసింది. కరోనా నిబంధనలతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. దుబ్బాక ఓటమితో బల్దియాలో గెలవాలనే పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది. బీజేపీ కూడా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. ఎంఐఎంకి సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉండగా.. కాంగ్రెస్ కూడా మెజార్టీ సీట్లపై కన్నేసింది.
Recommended Video
గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి తమ పరువు నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇందుకోసం భాగ్యనగర ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటీవల కురిసిన వర్షాలను ప్రతిపక్షాలు ఎత్తిచూపనున్నాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications