Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అంబర్‌పేట కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ ఎక్స్‌గ్రేషియా

హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఇటీవల వీధి కుక్కల దాడిలో మరణించిన బాలుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.

హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేటలో ఇటీవల వీధి కుక్కల దాడిలో మరణించిన బాలుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు. రూ. 9,71,900 ఎక్స్ గ్రేషియా చెక్కును అందించారు.

సోమవారం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బాలుడి తండ్రి గంగాధర్‌ను పిలిపించి ఎక్స్ గ్రేసియా అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులతో మేయర్, హైలెవల్ కమిటీ సభ్యులు మాట్లాడి ధైర్యం చెప్పారు.

 GHMC Mayor Gadwal Vijayalaxmi given ex-gratia of Rs 9,71,900 to childs family, who is died in stray dogs attack

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... ప్రభుత్వం తరఫున కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీధి కుక్కల కాటు, కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పాఠశాల విద్యార్థులకు, స్లమ్, టౌన్ లెవల్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు అవగాహన కల్పిస్తున్నట్లు మేయర్ తెలిపారు.

ఇటీవల అన్ని పార్టీల కార్పొరేటర్లు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో జీహెచ్ఎంసీ రూ. 6 లక్షలు, మేయర్ తరఫున రూ. 2 లక్షలు, మేయర్ గౌరవ వేతనం 65,000, డిప్యూటీ మేయర్ గౌరవ వేతనం 32,500, కార్పొరేటర్లు బన్నాల గీత రూ. 10,000, బాబా ఫసియుద్దీన్ రూ. 7,800, సామల హేమ రూ. 7,800, మన్నె కవితా రెడ్డి రూ. 8,000, రజిత రూ. 8,000, సోహెల్ ఖాద్రి రూ. 7,800, విజయ్ కుమార్ గౌడ్ రూ. 7,000, వనం సంగీత రూ. 10,000, వి.కవిత రూ. 8000లు అందజేసిన మొత్తం రూ. 9,71,900 చెక్కు ను సోమవారం డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కార్పొరేటర్‌లతో కలిసి మేయర్.. మృతి చెందిన బాలుడు తండ్రి గంగాధర్‌కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శృతి ఓజా, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్, హైలెవల్ కమిటీ సభ్యులు (కార్పొరేటర్లు) బాబా ఫసియుద్దీన్, సామల హేమ, వనం సంగీత, బన్నాల గీత, శ్రవణ్, సిఎన్ రెడ్డి, కొప్పుల నర్సింహా, పద్మ తదితరులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+