హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్లెక్సీ ఫైన్.. తలసానికి రూ.50 వేలు.. మిగతా నేతలకు ఇలా..

|
Google Oneindia TeluguNews

ప్లీనరీ సందర్భంగా ప్లెక్సీలు, కటౌట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరం వచ్చింది. దీంతో అధికారులు కంటి తుడుపు చర్య చేపట్టారు. ప్లీన‌రీ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీల‌పై జ‌రిమానాలు విధించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జ‌రిమానాలకు గురైన వారిలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ కూడా ఉన్నారు. ఆయ‌న ఏర్పాటుచేసిన ఫ్లెక్సీపై అధికారులు రూ.50 వేల జ‌రిమానా విధించారు.

 ప్లెక్సీ రగడ

ప్లెక్సీ రగడ


టీఆర్ఎస్ ప్లీన‌రీని పుర‌స్క‌రించుకుని ఆ పార్టీ నేత‌లు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశార‌ు. వాటిని తొల‌గించాల‌ని మంగ‌ళ‌వార‌మే బీజేపీ నేత‌లు అధికారుల‌ను డిమాండ్ చేశారు. బుధ‌వారం ఈ ఫ్లెక్సీల‌పై సోష‌ల్ మీడియాలో అధికారుల‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఫ్లెక్సీల‌పై అధికారులు జ‌రిమానాలు విధించారు. ఇందులో భాగంగా త‌ల‌సానికి రూ.50 వేలు ఫైన్ వేశారు. మైనంప‌ల్లి రోహిత్‌కు రూ.40 వేలు, దానం నాగేంద‌ర్‌కు రూ.5 వేలు, కాలేరు వెంక‌టేశ్ కు రూ.10 వేలు జ‌రిమానా విధించారు.

 ఫైన్

ఫైన్


ట్విటర్ వేదికగా వచ్చిన ఫిర్యాదులపై ఈవీడీఎం జరిమానా వేసింది. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీకి రూ.65 వేలు, ట్విటర్‌లో వచ్చిన వాటికి మాత్రమే ఈవీడీఎం జరిమానా విధించి చేతులు దులుపుకుంది.

ఇదీ సరికాదు..

ఇదీ సరికాదు..


అంతకుముందు టీఆర్ఎస్ ప్లీనరీ కోసం ఏర్పాటు చేసిన ప్లెక్సీలపై కేఏ పాల్ విరుచుకుపడ్డారు. సిటీ మొత్తం గులాబీమయంగా మారింది. దీనిపై పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లెక్సీలు, కటౌట్ పెట్టడానికి నియమ, నిబంధనలు వర్తించవ అని అడిగారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ప్లీనరీ కోసం సిటీ వ్యాప్తంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై పిటిషన్‌లో ప్రశ్నించారు. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, GHMC కమిషనర్ లను ప్రతివాదులుగా చేర్చారు.

 అప్పుడు అలా

అప్పుడు అలా


ఫ్లెక్సీలు పెట్టొద్దని ప్రభుత్వంలో గతంలో చెప్పిన విషయాన్ని పాల్ ప్రస్తావించారు. నేతలు, కార్యకర్తలు భారీగా ప్లేక్సీలు ఏర్పాటు చేశారని, రూల్స్‌కి విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్‌లో వెల్లడించారు. సిటీ అంతా ఫ్లెక్సీలే ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. క్లాసిఫైడ్స్ తో ప్రచారం చేస్కోవడం తప్పు కాదని, కానీ రోడ్డు మధ్యలో ఫ్లెక్సీలు పెట్టడం తప్పని కేఏ పాల్ అంటున్నారు.

English summary
ghmc officials are fine to minister talasani srinivas yadav on flexi issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X