Raja Singh: శ్రీరామ నవమి శోభా యాత్రకు సిద్ధమవుతున్న రాజా సింగ్..
శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ లో శోభా యాత్ర నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. గోషామహల్ భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్యే టి రాజా సింగ్ హైదరాబాద్‌లో రామనవమి శోభా యాత్రకు నాయకత్వం వహించనున్నారు. ఏప్రిల్ 17 బుధవారం ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభమవుతుందని తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో రాజా సింగ్ ప్రకటించారు.హైదరాబాద్‌లోని ధూల్‌పేట్‌లోని ఆకాశపురి హనుమాన్ ఆలయం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
మార్చి 30, 2023న జరిగిన శోభ యాత్ర సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. గతంలో ఊరేగింపును పర్యవేక్షించడానికి సుమారు 1,500 మంది పోలీసులను మోహరించారు. సున్నిత ప్రదేశాలలో పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కూడా హైదరాబాద్‌లో జరిగే రామనవమి శోభా యాత్రకు కూడా అదే తరహాలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు.

ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా రాజాసింగ్‌ను బీజేపీ నియమించింది. హైదరాబాద్ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ మాధవి లతను అభ్యర్థిగా ప్రకటించింది. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో విజయం సాధించేందుకు బీజేపీ మరోసారి పట్టుదలతో కసరత్తు చేస్తోంది.
బీజేపీ తెలంగాణలో గతం కంటే ఎక్కువ సీట్లు గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. 2019లో తెలంగాణలో బీజేపీ 4 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు ఇందులో ముగ్గురు సిట్టింగ్ లకు పార్టీ టికెట్ ఇచ్చింది.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
‘అభిజిత్’ లగ్నం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications