దిశ ఎఫెక్ట్.... విద్యార్థినిలకు కరాటే క్లాసులు... నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

దిశ హత్యతో ఓవైపు పోలీసులు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సైతం అప్రమత్తయ్యారు. ముఖ్యంగా యువతులపై అత్యాచారాలు చేయడం, వారిని నిర్దాక్షిణ్యంగా చంపడం కూడ చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివినా... పరిస్థితులను అంచనా వేయలేపోవడం...ముంచుకొచ్చే ముప్పును ఎదుర్కొనే శక్తి, లేకపోవడంతో ఈ దారుణాలకు విద్యార్థినిలు బలి అవుతున్నారని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. వీటిని అడ్డుకోవాలంటే విద్యార్థి దశ నుండే వారికి సమాజ పరిస్థితులతో పాటు శారీరక దృడత్వంపై అవగాహనా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Recommended Video

    News Roundup : Nithyananda's'Kailaasa' Nation || AP 10th Time Table 2020 || Oneindia Telugu

    దీంతో విద్యార్థినిలకు ఇలాంటీ ఆపద సమయంలో తమను తాము కాపాడుకునేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. ఆయా ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థినిలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ కోటి 38 లక్షల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 1513 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించనున్నారు. కాగా ప్రతి వారంలో మూడు రోజుల పాటు రోజుకో గంట చొప్పున మార్షల్ ఆర్ట్స్ తరగతులను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు గాను శిక్షకుడికి ఇచ్చేందుకు అర్ధిక వనరులు సమకూర్చారు.

    Govt School girls will have been trained martial arts

    విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి దిశ సంఘటన అనంతరం ఇలాంటీ సంఘటనలు జరగకుండా...ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు షీ టీంలను పంపి విద్యార్థినిలకు ఆత్మరక్షణ మెళకువలను నేర్పించాలని ఆమె పోలీసు అధికారులను కోరారు. ఎదైన అఘాయిత్యం జరిగినప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులతో ఫిర్యాదు చేసే విధంగా వారిని తయారు చేయాలని ఆమె సూచించారు. ఈనేపథ్యంలోనే విద్యాశాఖ తరపున కూడ మంత్రి విద్యార్థినిల్లో ఆత్మరక్షణ చర్యలను నింపేందుకు మార్షల్ ఆర్ట్స్‌ను నేర్పించాలని నిర్ణయించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+