సామూహికంగా ఏడవండి...! ఎక్కెక్కి ఏడ్చి వెళ్లండంటున్న ఓ క్లబ్బు..!!
హైదరాబాద్ : లాఫింగ్ క్లబ్, బోటింగ్ క్లబ్, క్లాపింగ్ క్లబ్ ఇలా రకరకాల క్లబ్బులను చూసాం. అంతే కాకుండా అడపాదడపా ఆ క్లబ్బులను సందర్శించి ఉండి ఉంటాం. కాని నగరంలో వెలిసిని ఓ క్లబ్బు ఆందరి ద్రుస్టిని ఆకర్శిస్తోంది. మీరు వివిధ సమస్యలతో సతమతం అవుతున్నారా? మనసంతా దుఖంతో నిండిపోయిందా? చుట్టూ అందరూ ఉండటం వల్ల మనస్ఫూర్తిగా ఏడ్వలేకపోతున్నారా? అయితే మా క్లబ్ కి రండి, మీరు తనివితీరా..మనస్ఫూర్తిగా ఏడ్వవచ్చు అంటున్నారు 'ఏబీసీ లాఫింగ్ క్లబ్' వారు. ఎలా ఏడ్వాలి అనే అంశంపై ట్రైనింగ్ కూడా ఇస్తామనడం మరో విశేషం..!
బషీర్ బాగ్‌లోని దేశోద్ధారక భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్లబ్ చైర్మన్ ఏ.వి.సత్యనా రాయణ మాట్లా డుతూ.. 'ఏబిసి లాఫింగ్ క్లబ్' ఆధ్వర్యంలో క్రైయింగ్ క్లబ్ ని కూడా ప్రారంభిస్తున్నామన్నారు . ఆదివారం ఉదయం 9గంటలకు సికింద్రాబాద్ లోని గుజరాతీ సేవా మండల్, బల్దేవ్ హాల్‌లో ఈ క్లబ్ ని గుజరాత్ కు చెందిన లాఫింగ్ క్లబ్ వ్యవస్థాపకులు కమలేష్ మసాలవాల ఈ ఏడుపుగొట్టు క్లబ్బును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లక్ష్మణ్, తదితరులు పాల్గొ న్నారు.













Click it and Unblock the Notifications