నగ్నంగా ఉండమంటాడు, మూత్రం తాగమంటాడు: శాడిస్ట్ భర్తపై భార్య ఫిర్యాదు
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కొంత కాలం బాగానే ఉన్నాడు కానీ.. ఆ తర్వాత నుంచే అతని కుటిలబుద్ధి, క్రూరత్వం బయటపడింది. ఆమెను కులం పేరుతో దూషించడం, చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. అంతేగాక, అర్ధనగ్నంగా ఉండాలని, మూత్రం తాగాలంటూ హింసించాడు. దీంతో అతని వేధింపులు భరించలేక పోలీసులు ఆశ్రయించింది వివాహిత. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కులంపేరుతో దూషిస్తూ వేధింపులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట మక్తల్‌కు చెందిన మహిళ రహమత్‌నగర్‌లో నివసిస్తోంది. ఆమె 2016లో ఓ యువకుడితో ప్రేమ వివాహం చేసుకుంది. కొన్ని రోజుల మంచిగా చూసుకున్న భర్త.. ఆతర్వాత వేధించడం మొదలుపెట్టాడు. గర్భం దాల్చినా గర్భస్రావం చేయించాడు. 2020లో భర్త సోదరుడు, సోదరి, బావ ఆమెను కులం పేరుతో దూషించేవారు. పలుమార్లు పెట్రోల్ పోసి చంపేస్తానంటూ బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.

నగ్నంగా కూర్చోవాలంటూ, మూత్రం తాగాలని వేధింపులు
ఈ క్రమంలో భర్తకు రూ.1.50 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత కూడా వేధింపులు ఆపలేదని తెలిపింది. తనను.. కులం పేరుతో దూషిస్తూ.. తీవ్రంగా కొట్టేవాడని వాపోయింది. అర్ధనగ్నంగా కూర్చోవాలంటాడని.. మూత్రం తాగాలని బలవంతం చేసేవాడని ఫిర్యాదులో పేర్కొంది. శాడిస్ట్ భర్త, అతని కుటుంబసభ్యుల వేధింపులు రోజురోజుకు మరింతగా పెరగడంతో భరించలేని ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కేబీఆర్ పార్కులో మృతదేహం కలకలం
హైదారబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం సంఘటానా స్థలానికి చేరుకున్న పోలీసులు పలు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. అయితే.. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ పుటేజీలను పరిశీలించిన అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications