ఏందీ సారు.. మాస్క్ పేరున లైంగికదాడి.. హెడ్ మాస్టర్ తీరు ఇది..
ఏదో సాకులు చూపి.. స్టూడెంట్ప్‌పై లైంగికదాడులకు తెగబడుతున్నారు. పని చేసే చోట, స్కూల్, కాలేజీ.. ఎక్కడ అయినా సరే వారికి సరయిన రక్షణ లేకుండా పోయింది. మాస్కు పెట్టుకోలేదని పిలిచి విద్యార్ధినిపై హెడ్మాస్టర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ శివారులో ఈ ఘటన జరిగింది. బిడ్డలా చూసుకోవాల్సిన బాలికపై పశువులా లైంగిక దాడికి పాల్పడ్డాడు.
శామిర్‌పేటలో 9వ క్లాస్ చదువుతున్న విద్యార్ధినిపై స్కూలు హెడ్మాస్టారు అత్యాచారానికి పాల్పడ్డాడు. డిసెంబర్ 22న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని శామిర్‌పేటకు చెందిన ఓ విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతోంది. డిసెంబర్ 22న స్కూలుకు వెళ్లిన బాలిక మాస్కు పెట్టుకోలేదు. దీంతో హెడ్మాస్టారు తన గది రా అంటూ పిలిచాడు. విద్యార్థినిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు దుర్భాషలాడాడు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? అంటూ ఆ విద్యార్థినిపై బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు.

విషయం ఎవరికైనా చెబితే నీ అంతు చూస్తానని బెదిరించాడు. ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది. ఓ సందర్భంలో విషయం బయటపడింది. గతంలో అదే స్కూల్‌లో పనిచేసిన మహిళా హెడ్మాస్టారు స్కూల్‌కు రావటంతో పాపం ఆ బాలిక తనలో దాచుకున్న బాధను ఆమె ముందు చెప్పింది. బాలిక బాధ విన్న ఆమె బాలికకు తాను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పింది. దీంతో బాధితురాలు తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెడ్మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
చదువు చెప్పే టీచర్ ఇలా చేయడం సరికాదు. సమాజంలో వారికి ఉన్న మంచి స్థానాన్ని కొందరు చేయడం వల్ల మిగతా వారికి కూడా బ్యాడ్ నేమ్ వస్తోంది. టీచర్ అంటే సక్రమ మార్గంలో నడిపే గురువు.. పిల్లలు అంటే వారిని బిడ్డల్లా చూడొద్దు. వక్రబుద్ది.. వంకర చూపుతో చూసి.. ఇలా కొందరు తప్పుగా ప్రవర్తిస్తున్నారు. లైంగికదాడికి తెగబడుతూ తమ స్థానాన్ని వారే దిగజారుచుకుంటున్నారు.












Click it and Unblock the Notifications