హైదరాబాద్‌లో భారీ వర్షం- మరో రెండు రోజులు అలర్ట్

హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా దంచికొట్టింది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకాన్ని కలిగించింది. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. గంట వ్యవధిలోనే రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. ఇదే పరిస్థితి మరో రెండురోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

మంగళవారం రాత్రి నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొట్టింది. కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. సాయంత్రం వరకు ఎలాంటి వర్షసూచన లేనప్పటికీ.. ఆ తరువాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పు కనిపించింది. తేలికపాటి జల్లులతో మొదలైన వర్షం ఏకధాటిగా కురిసింది. రాత్రి 9 గంటల సమయంలో జోరందుకుంది.

అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, బాలానగర్, సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ, బేగంపేట్, నాచారం, కుషాయిగూడ, ఉప్పల్, నాగోల్, చార్మినార్, చంద్రాయణ్‌గుట్ట, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, లక్డికాపూల్, మెహిదిపట్నం, అత్తాపూర్, లంగర్ హౌజ్, ఆరాంఘర్, రాజేంద్రనగర్‌ వంటి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.

Hyderabad rains

ఫలితంగా పలు చోట్ల రోడ్లపై వరదనీరు చేరింది. రాకపోకలు స్తంభించిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. వర్షం పడిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు అప్రమత్తం అయ్యారు. గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకున్నారు.

వాహనాల రాకపోకలు స్తంభించకుండా ట్రాఫిక్ పోలీసులు వర్షాన్ని సైతం లెక్కచేయలేదు. వర్షంలో తడుస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేయడం కనిపించింది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+