హైదరాబాద్‌లో భారీ వర్షం.. రేపు, ఎల్లుండి కూడా వానలు

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఉప్పల్, యూసుఫ్ గూడ, వెస్ట్ మారేడ్ పల్లి, మల్కాజిగిరి, మల్లాపూర్ బయోడైవర్సిటీ ప్రాంతం, మాదాపూర్, కాప్రా, సఫిల్ గూడ, ఖైరతాబాద్, మోతీనగర్, తిరుమలగిరి, కూకట్ పల్లి, షేక్ పేట తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. గంట సేపు ఏకబిగిన వర్షం కురియడంతో రోడ్లపై నీరు పొంగిపొర్లింది. దాంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

హైద‌రాబాద్‌ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. కుండపోత వాన కురిసింది. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు చోట్ల కుంభవృష్టి కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, ఖైర‌తాబాద్‌, అమీర్‌పేట‌, సోమాజిగూడ‌, సికింద్రాబాద్‌, లక్డికాపూల్‌, నాంపల్లి, యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌ కాలనీ పాటు ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది.భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షంతో నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పాతబస్తీ బహదూర్‌పురా దగ్గర రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మాదాపుర్ శిల్పారామం సమీపంలో ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరడంతో పాటు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.

heavy rain at hyderabad city

ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో వార్త చెప్పింది. రానున్న మూడు రోజులు తెలంగాణలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో స‌ముద్ర మ‌ట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొనసాగుతుందని, దీని ప్రభావంతో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. శనివారం ఒక‌ట్రెండు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపుల‌తో చాలా చోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందన్నారు. వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రించారు.

ఆగస్టు చివరి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. వర్షాల దాటికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల దాటికి పలు చోట్ల నీరు రోడ్లపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక గత రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో వార్త చెప్పింది. రానున్న మూడు రోజులు తెలంగాణలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+