Rain In Hyderabad: హైదరాబాద్‍లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. అరగంటపాటు కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.యూసఫ్ గూడ, బోరబండ, మోతినగర్, కేపీహెచ్బీ, కూకట్ పల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్ల పైకి నీరు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

 Rain In Hyderabad:

రెండో శనివారం కావడంతో రోడ్లపై వాహనాల రద్దీ తక్కువగానే ఉంది. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో నగర మేయర్ గద్వాల్ లక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. మరోవైపు దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో శని ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మూడు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వివరించింది.

వచ్చే మూడు రోజుల్లో ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గాలులు కూడా వీస్తాయని వివరించింది. మరోపైవు రుతుపవనాల తిరోగమనం నేటి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంచా వేసింది. అయితే ఈ సంవత్సరం రుతుపవనాలు లేటు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల సీజన్ లో వర్షపాతం బాగాన ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది. సాధారణంగా జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 నైరుతి రుతుపవనాల సీజన్ గా పేర్కొంటారు. ఈ సీజన్ తెలంగామలో 72.10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. నిజామాబాద్‌ జిల్లాలో గురువారం అత్యధికంగా 42.3 మి.మీ వర్షపాతం నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+