Rains In Hyderabad: హైదరాబాద్‍లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. రోడ్లపైకి చేరిన నీరు..
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం 7 గంటలకు జల్లులుగా మొదలైన వాన 8 గంటల తర్వాత కాస్త జోరందుకుంది. మియాపూర్, నిజాంపేట, లింగంపల్లి, చందనగర్, జేఎన్టీయూ, కూకట్ పల్లి, కేపీహెచ్బీ, బాలనగర్, మూసాపేట, భరత్ నగర్, మోతినగర్, ఎస్సార్ నగర్, అమీర్ పేట, బొరబండ, రహమత్ నగర్, యూసఫ్ గూడ, జూబ్లీ చెక్ పోస్ట్, జూబ్లీ హిల్స్, మదాపూర్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, మెహదీపట్నం, మసబ్ ట్యాంక్, లక్డికపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, క్రాస్ రోడు, చిక్కడ్ పల్లి, నారాయణ గూడ, అంబర్ పేట, తర్నాక, ఉప్పల్, రామంతాపూర్, నాగోల్, ఎల్బీనగర్ లో వర్షం కురుస్తోంది.
వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై నీరు చేరింది. సోమవారం కావడంతో రోడ్లు పైకి భారీగా వాహనాలు వచ్చాయి. పలు చోట్లు వర్షపు నీరు రోడ్లుపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు గంటలపై రోడ్డుపై ఉండాల్సి వస్తుంది. వర్షసూచన ఉండడంతో చాలా మంది మెట్రో లో ప్రయాణానికి మొగ్గు చూపారు. దీంతో మెట్రో రైళ్ల రద్దీ భారీగా పెరిగింది.

ముఖ్యంగా అమీర్ పేట నుంచి రాయదుర్గం మార్గంలో మెట్రో రైళ్ల జనం కిక్కిరిసిపోయారు. ప్రయాణికులు రద్దీ దృష్ట్య మెట్రో అదనపు రైళ్లను నడుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు మరో రెండు, మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తెలంగాణలో మిగతా జిల్లాలో కూడా వర్షం కురిసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
అటు ఏపీలోని రాయసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వైఎస్సార్ జిల్లా రాజోలి ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. అటు తిరుపతి జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి.












Click it and Unblock the Notifications