Hyderabad: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..
ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, మేడ్చల్, సికింద్రాబాద్, బేగంపేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, అమీర్ పేట్, పటాన్ చెరు, మియాపూర్, కేబీహెచ్బీ, కూకట్ పల్లి, ఎస్ఆర్ నగర్, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో వర్షం కురిసింది. అక్కడక్కడ కాస్త ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పటికీ ఆదివారం కాబట్టి త్వరగానే క్లియర్ అయింది.
లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఆదివారం సెలవు రోజు కావడంతో మార్కెట్, షాపింగ్ మాల్ ఉన్న ప్రాంతాల్లో వర్షం కురవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షంతో గాలులు రావడంతో పలు చోట్ల చెట్ల కొమ్మలు, చెట్లు విరిగిపడ్డాయి.

దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని సూచించారు. తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా వర్షం కురిసింది. కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షం కురిసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని దాని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.












Click it and Unblock the Notifications