Hyderabad: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు..

హైదరాబాద్ లో గత మూడు రోజులుగా రాత్రి వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం, శనివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. ఆదివారం రాత్రి కూడా భాగ్యనరంలో వానలు పడ్డాయి. మాదాపూర్, కాకతీయ హిల్స్, హైటెక్ సిటీ, మోతినగర్, బోరబండ, అమీర్ పేట, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ, పంజాగుట్టు, జూబ్లీహిల్స్, బేగంపేట, నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపూరం, హయత్ నగర్ లో, దిల్ సుఖ్ నగర్, మలక్ పేటలో భారీ వర్షం కురిసింది. రాత్రి పూట వర్షాలు పడడంతో ఇబ్బందులు తప్పాయి.

అయితే పలు చోట్ల చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. జీహెచ్ఎంసీ మాన్ సూన్ టీమ్స్ ఎప్పటికప్పుడు నీటిని క్లియర్ చేస్తున్నారు. హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే రెండు, మూడు రోజులు పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆవర్తన ద్రోణి ప్రభావంతో కొన్ని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Heavy rain lashed many parts of Hyderabad on Sunday night

పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలను అలెర్ట్ జారీ చేసింది. అలాగే యాదాద్రి భువనగిరి , రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వనపర్తి, నారాయణపేట్, గద్వాల, మెదక్ ,మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసంది. కాగా గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు అయింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 7.7 సెంటిమీటర్ల వర్షపాత నమోదు కాగా.. గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలోని ఆసిఫ్‌నగర్‌లో 6.3 సెంటీమీటర్లు, గోల్కొండలో 6.3, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6.1, మంచిర్యాల జిల్లా బీమారంలో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. కాగా సోమవారం వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+