వర్ష బీభత్సం: గ్రేటర్‌లో భారీ వాన, మిగతా చోట్ల కూడా, జనం ఇబ్బందులు

వర్షం భారీగానే కురుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో చాలా ప్రభావం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచే మొదలైన వాన.. మధ్యాహ్నానికి మొత్తం నగరవ్యాప్తంగా విస్తరించింది. ముసురు నెలకొనడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

సికింద్రాబాద్, మల్కాజిగిరి, అంబర్ పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వాన పడింది. గురువారం సాయంత్రానికి కూడా పలు ప్రాంతాల్లో వాన కొనసాగుతూనే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చేరాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేసింది.

heavy rain lashes in hyderabad and other places in the state

వర్షం పడటంతో ట్రాఫిక్‌కు తీవ్రంగా ఇబ్బంది ఎదురైంది. వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా అక్కడక్కడా విస్తారంగా వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు మూడు రోజులు కూడా వానలు కొనసాగుతాయని వెల్లడించింది.

హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న వికారాబాద్ జిల్లా పరిధిలో గురువారం అతి భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరపి లేని వానతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పరిగి - మహబూబ్ నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల కూడా రహదారులపై నీళ్లు ప్రవహిస్తుండటంతో పోలీసులు ఆయా గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+