హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన... తడిసిన ముద్దయిన నగరం... విద్యుత్ శాఖ అప్రమత్తం...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం(అక్టోబర్ 9) సాయంత్రం భారీ వర్షం దంచి కొడుతోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దాదాపు గంటన్నర నుంచి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడక్కడా రోడ్ల పైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

న‌గ‌రంలోని హిమాయత్ నగర్, ముషీరాబాద్, గాంధీనగర్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, రాంనగర్‌, అబిడ్స్‌, అఫ్జల్‌గంజ్‌, కోఠి, పురానాపూల్‌,ఖైర‌తాబాద్‌, పంజాగుట్ట‌, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట‌, బేగంపేట‌, సికింద్రాబాద్‌, అల్వాల్, తార్నాక‌, ఉప్ప‌ల్, నాచారం, ఎల్బీన‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, క‌ర్మ‌న్‌ఘాట్‌, మ‌ల‌క్‌పేట‌, చార్మినార్‌, జూపార్క్‌, జియ‌గూడ‌, లంగ‌ర్‌హౌస్‌, మెహిదీప‌ట్నం, కోఠి, అబిడ్స్, ల‌క్డీకాపూల్‌, గ‌చ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, ప‌టాన్‌చెరు, కూక‌ట్‌ప‌ల్లి ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది.

heavy rainfall lashes hyderabad on friday evening

అకాల వర్షం కారణంగా నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘురామరెడ్డి రంగంలోకి దిగారు. విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్ష ప్రభావం గల రాజేంద్ర నగర్,సైబర్ సిటీ,బంజారాహిల్స్,సికింద్రాబాద్,హబ్సిగూడ,సరూర్ నగర్ సర్కిల్స్‌లో ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా రోడ్లు లేదా భవనాలపై విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే సమాచారం అందించాలన్నారు. వోల్టేజీలో హెచ్చు తగ్గులున్నా సమాచారం చేరవేయాలన్నారు.

ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం కారణంగా హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.హైదరాబాద్‌తో పాటు కరీంనగర్,భూపాలపల్లి,సిద్దిపేట,వరంగల్,నల్గొండ,యాదాద్రి భువనగిరి,కొత్తగూడెం,ఖమ్మం,నల్గొండ,సూర్యాపేట జిల్లాల్లో ఇవాళ రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా రాష్ట్రంలో పలుచోట్ల వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం(అక్టోబర్ 10) ఒకటి,రెండు చోట్ల భారీ వర్షాలు,ఆదివారం(అక్టోబర్ 11) ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

English summary
The rains which started in some areas in Hyderabad on Friday evening, soon spread to several parts of city and lashed relentessly for 1 hour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X