హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు: ఐఎండీ వార్నింగ్, ఎల్లో అలర్ట్

హైదరాబాద్: నగర వాసులకు మండుతున్న ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. ఎందుకంటే, గురువారం, శుక్రవారాల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మార్చి 20 తేదీ వరకు కూడా నగరంలో వర్షం కురుస్తుందని తెలిపింది. అంతేగాక, మార్చి 16, 17 తేదీల్లో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

పిడుగులు పడతాయంటూ హెచ్చరికలు

పిడుగులు పడతాయంటూ హెచ్చరికలు

మరోవైపు మార్చి 20 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గాలిదుమారంతోపాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, గురువారం ఉదయం కాస్త ఎండగా ఉన్నప్పటికీ.. నగరంలో మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లగా మారిపోయింది. చాలా ప్రాంతాలు మేఘావృతమయ్యాయి.

హైదరాబాద్‌లోని ఆరు జోన్లలోనూ వర్షాలు

హైదరాబాద్‌లోని ఆరు జోన్లలోనూ వర్షాలు

హైదరాబాద్‌లోని ఆరు జోన్లు హైదరాబాద్-ఛార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో మేఘావృతమై వాతావరణం చల్లగా ఉండనుంది. హైదరాబాద్ నగర పరిధిలో గురువారం సాయంత్రం లేదా రాత్రి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 36 డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ వర్షాలతో నగర ప్రజలకు ఎండవేడిమి నుంచి కాస్త ఉపశమనం లభంచనుంది.

హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్

హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్

హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మార్చి 20 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(TSDPS) కూడా హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు 27 డిగ్రీ సెల్సియస్ కు తగ్గనున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బయటకు వెళ్లేటప్పుడు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+