జగిత్యాల జలమయం.. భారీ వర్షంతో చెరువులను తలపించిన రోడ్లు..
గత కొద్దీరోజులుగా ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. అదీ ఇవాళ చల్లగా మారి.. వర్షం కురుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. పట్టణంలోని వీధులు వరదనీటితో నిండిపోయాయి. వర్షం కాసేపు కురిసిన.. దంచికొట్టింది. దీంతో డ్రైనేజీల్లో నీరు చేరింది.
తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తోన్నాయి. మెట్‌పల్లి, వేంపేటలో వర్షం దంచికొట్టింది. ఇటు మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 18.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్ రూరల్‌లో 13 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో 12 సెంటిమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు కాగా.. పలు జిల్లాల్లో 8 నుంచి 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇటు రాజధాని హైదరాబాద్‌లోనూ రాత్రి నుంచి ఉదయం వరకు జల్లులు పడ్డాయి. సాయంత్రం కూడా వర్షం దంచికొట్టింది. చిరుజల్లులకే భాగ్యనగర రహదారులు తడిసి ముద్దావుతాయి. ఇక భారీ వర్షంతో మ్యాన్ హోల్స్ తెరవాల్సి వచ్చింది. ఆయా చోట్ల వెళ్లొద్దని అక్కడున్న వారు చెబుతున్నారు. వర్షంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
జగిత్యాల జలమయం.. భారీ వర్షంతో చెరువులను తలపించిన రోడ్లు..#Weather #Rains #Telangana pic.twitter.com/neCVstu27v
— oneindiatelugu (@oneindiatelugu) June 27, 2021


Click it and Unblock the Notifications