మూడురోజులు వర్షాలు, హైదరాబాద్‌లో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం..
అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనంతో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
ఇటు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మిగతాచోట్ల వాతావరణం మారింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. సిటీలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. అబిడ్స్, చార్మినార్, నాంపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హిమాయత్ నగర్, కోఠి తదితర ప్రాంతాల్లో భారీగానే వర్షం పడుతోంది. వీటితోపాటు ఫిల్మ్ నగర్, సైదాబాద్, మలక్‌పేట, ముషీరాబాద్, చాదర్‌ఘాట్, రాంనగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడింది.

గత కొద్ది రోజులుగా వేడితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షంతో కాస్త ఉపశమనం కలిగింది. అయితే లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు రోడ్లపైకి చేరింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు.












Click it and Unblock the Notifications