హైదరాబాద్‌లో కుండపోత వర్షం: రహదారులు జలమయం, వరదలోనే నగరజీవులు

హైదరాబాద్: నగరంలో శుక్రవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు ఎండ, ఉక్కపోతగా ఉండగా.. హఠాత్తుగా మేఘాలు కమ్ముకుని కుండపోత వర్షం పడింది. దీంతో అనేక ప్రాంతాల్లో వదర నీరు చేరుకుంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం

బేగంపేట్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, శేరిలింగంపల్లి, కేపీహెచ్‌బీ, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ , సికింద్రాబాద్, సనత్ నగర్ ,అమీర్పేట్, కొత్తపేట్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, చంపాపేట్, తార్నాక, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదీగూడ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది.

ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం

హైదర్ నగర్, ప్రగతినగర్, జీడిమెట్ల, బాలానగర్, అపురూపకాలనీ, గాజులరామారం, సూరారం, బషీర్ బాగ్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బేగం బజార్, ఖైరతాబాద్, లక్డీకపూల్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, కవాడిగూడ, గాంధీనగర్, రాంనగర్, ఉప్పల్, రామాంతపూర్, నాంపల్లి, అబిడ్స్, వనస్థలిపురం, హయత్ నగర్, తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వాన కురుస్తోంది. ఓయూ, మల్కాజ్ గిరి, నేరేడ్ మెట్, నాచారం, మల్లాపూర్, కుషాయిగూడ పరిసర ప్రాంతాల్లో దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.

హైదరాబాదీలకు తప్పని వరద బాధ

హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో రోడ్లపై వరదనీరు నిలిచింది. పలు చోట్ల ట్రాఫిక్ జాం అయింది. రాష్ట్రంపై ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరో రెండు మూడ్రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వరద నీరు వెనక్కి వెళ్లిందని ఊపిరిపీల్చుకుంటుండగా.. మరోసారి భారీ వర్షం ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+