హైదరాబాద్‌లో 159 కంటైన్‌మెంట్ జోన్లు.. ఇదిగో పూర్తి జాబితా...

తెలంగాణలో ఇప్పటివరకూ 3147 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. అందులో అత్యధికంగా హైదరాబాద్‌లోనే 1828 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒక్కరోజే హైదరాబాద్‌లో 110 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో కంటైన్‌మెంట్ జోన్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తాజాగా కంటైన్‌మెంట్ జోన్ల సంఖ్యను మరింత పెంచారు. ప్రస్తుతం నగరంలో 150 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ఎల్బీనగర్ జోన్‌లో మొత్తం 21 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. ఇందులో ఉప్పల్ సర్కిల్‌లో 16, సరూర్‌నగర్‌లో 4, హయత్‌నగర్‌లో ఒకటి చొప్పున కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి.

here is full list of 159 containment zones in hyderabad

చార్మినార్ జోన్‌లో 28 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. సంతోష్ నగర్‌లో 16, చార్మినార్‌లో 5, ఫలక్‌నుమాలో 4,చాంద్రాయణ గుట్టలో 2, మలక్‌పేటలో 1 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి.

ఖైరతాబాద్ జోన్లో కంటైన్‌మెంట్ జోన్ల సంఖ్య 35కి చేరింది. కర్వాన్ జియాగుడ డివిజన్లలో 17, జూబ్లీహిల్స్‌లో 8, మెహదీపట్నంలో 5, ఖైరతాబాద్‌లో 5, చొప్పున కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి.

సికింద్రాబాద్ జోన్లో 33 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. అంబర్‌పేటలో 13, సికింద్రాబాద్‌లో 6, ముషీరాబాద్‌లో 7, మల్కాజ్‌గిరిలో 7 చొప్పున కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. కూకట్‌పల్లిలో 10 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి.

రాజేంద్ర నగర్‌ నగర్ జోన్‌లోని రాజేంద్రనగర్, మణికొండ ప్రాంతాల్లో 7 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. అటు శేరిలింగంపల్లి జోన్‌లోని చందానగర్ డివిజన్‌లో 4, శేరిలింగంపల్లిలో 5 చొప్పున మొత్తం 9 కంటైన్‌మెంట్ జోన్లున్నాయి.

కుత్బుల్లాపూర్‌లో 7, మహేశ్వరం జోన్‌లోని జల్‌పల్లి మున్సిపాలిటీలో 6, బడంగ్‌‌పేటలో 3 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి.

మొత్తంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 159 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాలు మొత్తం కంటైన్‌మెంట్‌లో లేవని.. అందులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇళ్లు మాత్రమే కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్నాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+