హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహేశ్ బాబు ఇంట్లో విషాదం.. సోదరుడు రమేశ్ కన్నుమూత

|
Google Oneindia TeluguNews

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు శనివారం రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు రమేష్ బాబు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా తుది శ్వాస విడిచారు.

మనుషులు చేసిన దొంగలు సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రమేష్ బాబు. సామ్రాట్‌ మూవీతో హీరోగా పరిచయం అయ్యారు. దాదాపు 15 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత నిర్మాతగా మారారు. తెలుగుతోపాటు హిందీ సినిమాలను కూడా నిర్మించారు. సూర్యవంశం (హిందీ), అర్జున్‌, అతిథి, దూకుడు చిత్రాల ఆయన ప్రొడ్యూసర్‌గా వ్యవరించారు.

hero mahesh brother ramesh died

రమేష్ బాబు మృతితో ఘట్టమనేని ఇంట్లో విషాదం చోటుచేసుకుంది . అయితే మహేష్ బాబుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హొం ఐసోలేషన్‌లో ఉన్నారు. రమేష్ బాబు భౌతికకాయం చూడడానికి వస్తారా.. రారా అన్నది తెలియాల్సి ఉంది.

English summary
hero mahesh babu brother ramesh babu died due to illness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X