Samantha: రూ. 8 కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేసిన సమంత.. ఎక్కడంటే..!
టాలీవుడ్ ప్రముఖ నటి సమంత హైదరాబాద్ లో విలాసవంతమైన డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిందని సమాచారం. దాదాపు 8 కోట్ల విలువ చేసే ఈ అపార్ట్మెంట్ లో 6 కారు పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయని తెలుస్తోంది. బిల్డింగ్ 13వ అంతస్తులో 3,920 చదరపు అడుగులు, 14వ అంతస్తులో 4,024 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 7,944 చదరపు అడుగుల విస్తీర్ణంలో సూపర్ బిల్ట్-అప్ ఏరియా ఉందట. ఈ అపార్ట్ మెంట్ ను సమంత తనకు నచ్చినట్టుగా ఇంటీరియర్ డిజైన్ చేసుకుంది.
సమంతకు హైదరాబాద్ లోనే కాదు ముంబై లో కూడా 15 కోట్ల విలువ చేసే విలాసవంతమైన బిల్డింగ్ ఉందట. సమంత ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో నటిస్తోంది. ఇక ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ 'ఖుషీ' సినిమాపైనే ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు సినిమాపై కాస్త మంచి అటెన్షన్‌నే క్రియేట్ చేశాయి. రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది.

ఈ మధ్యే అక్కినేని వారసుడు నాగచైతన్య తన మాజీ భార్య సమంత గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. సమంత మనసున్న వ్యక్తి అని చెప్పారు. సమంత ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సోషల్ మీడియా వల్లే తమ మధ్య ఏదో ఉన్నట్లు ప్రచారం జరిగిందని చైతన్య చెప్పారు. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పుడు వ్యక్తిగత జీవితంపై పలువురు తనను ప్రశ్నిస్తారని అన్నారు. అలాంటి ప్రశ్నలకు మౌనంగా ఉండేవాడినని పేర్కొన్నారు. కానీ.. వాళ్లు నా పెళ్లి గురించే ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని చెప్పారు.
తాము విజయం సాధిస్తాయానే సినిమాలు తీస్తాం కానీ.. అవి పరాజయం పాలవుతుంటాయిని వివరించారు. సినిమా కెరీర్ లో ఇదే సాధారణమేనని తెలిపారు. కస్టడీ సినిమాపై తనకు నమ్మకం ఉందని.. ఈ సినిమా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో సమంతా ఒకరిగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో జయభేరి కౌంటీ గేటెడ్ కమ్యూనిటీలో ఖరీదైన డూప్లెక్స్ ప్లాట్‌ను కొనుగోలు చేశారు. సమంత నికర ఆస్తుల విలువ రూ. 89 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications