ఫేస్‌బుక్ నుంచి పేర్లు, ఫోటోలు.. పోర్న్ వెబ్‌సైట్లపై హైకోర్టు సీరియస్..!
హైదరాబాద్ : పోర్న్ వెబ్‌సైట్లపై హైకోర్టు సీరియస్ అయింది. ఆ క్రమంలో గూగుల్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. పోర్న్ వెబ్‌సైట్లకు సంబంధించి పూర్తి వివరాలు న్యాయస్థానంలో సమర్పించాలని ఆదేశించింది. పోర్న్ వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్‌పై మంగళవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఆ క్రమంలో అశ్లీల పోర్న్ వెబ్‌సైట్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
సోషల్ మీడియా వేదికైన ఫేస్‌బుక్ నుంచి కొందరి పేర్లు, ఫోటోలు సేకరించి వాటిని పోర్న్ పోర్న్ వెబ్‌సైట్లలో పెడుతున్నారని ఆరోపిస్తూ ఓ యువతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సదరు పిటిషన్‌పై మంగళవారం నాడు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ యువతి చెప్పిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంది.

ఆ క్రమంలో తన పేరుతో పాటు తనకు సంబంధించిన ఫోటోలు పోర్న్ సైట్లలో దర్శనమివ్వడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆ యువతి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ విషయం గూగుల్ సంస్థకు గతంలో ఫిర్యాదు చేసినట్లు న్యాయస్థానానికి వివరించారు. తన పేరు, ఫోటోలను డిలేట్ చేయాల్సిందిగా కోరినప్పటికీ ఎలాంటి స్పందన లేదని చెప్పుకొచ్చారు.
గూగుల్ సంస్థ రెస్పాండ్ కాకపోయేసరికి హైకోర్టు మెట్లెక్కారు ఆ యువతి. ఆమె పిటిషన్‌పై విచారించిన హైకోర్టు పోర్న్ వెబ్‌సైట్లపై సీరియస్ అయింది.పోర్న్ వెబ్‌సైట్లు రూపొందిస్తున్నవారి పట్ల గూగుల్ సంస్థ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించింది. అలాంటి వెబ్‌సైట్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో అశ్లీల వెబ్‌సైట్లకు అడ్డుకట్ట వేయాల్సిందిగా గూగుల్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల ఒకటో తేదీకి వాయిదా వేస్తూ పోర్న్ వెబ్‌సైట్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications