బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు తీర్పు 6న

తెలంగాణ సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసులో సీబీఐ దర్యాప్తుపై ఫిబ్రవరి 6న హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: తెలంగాణ సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసులో సీబీఐ దర్యాప్తుపై ఫిబ్రవరి 6న హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం వద్ద అప్పీల్ చేసింది.

విచారణంలో భాగంగా సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. అయితే, ఈ తీర్పును సోమవారం ఉదయం 10.30 గంటలకు వెల్లడించనుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు పట్ల నమ్మకం లేదని బీజేపీ, నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి వేసిన పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. కేసును సీబీఐకి బదిలి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

High Court verdict on the cbi investigation in brs mlas poaching case on Feb 6th.

అయితే, కేసును సీబీఐకి అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని సిట్ తరపు న్యాయవాది జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో పురోగతి ఉన్నందున సిట్ తో దర్యాప్తు చేయించాలని కోరారు. అయితే, అడ్వకేట్ వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను కూడా సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో సోమవారం హైకోర్టు తీర్పు ఈ కేసులో కీలకంగా మారింది.

గత సంవత్సరం అక్టోబర్ 2న హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో ఈ కేసు మొదలైంది. తనతోపాటు బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులను కొందరు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ అక్టోబర్ 62న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను అదే రోజు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+